తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న బాలకృష్ణ ఈ సంవత్సరం చారిత్రాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.  ఈ చిత్రం బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లు కూడా సాధించింది.  ఇక తన తదుపరి చిత్రంపై కూడా బాలకృష్ణ మంచి శ్రద్ద వహిస్తున్నట్లు తెలుస్తుంది.  ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా వెంట వెంటనే సినిమాలకు ఓకే చెప్పేయడంతో ఇండస్ట్రీలో పెద్ద హీరోల హవా మొదలైంది.  
Image result for puri jagannadh
ఇక ఇండస్ట్రీలో ‘పోకిరి’ లాంటి బ్లాక్ బ్లస్టర్ అందించడమే కాకుండా  కొత్త హీరోలకు కేరాఫ్ ఆడ్రస్ గా నిలిచానే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ .   ఇప్పటికే ఎన్నో విభిన్నమైన కథనాలతో ఫుల్ లెన్త్ యాక్షన్, ఎంట్రటైన్ మెంట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు పూరి.  పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.
Image result for balakrishna
పవర్‌ఫుల్‌ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్‌ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్‌ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్‌ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్‌ మీల్స్‌ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే యమా క్రేజ్‌ నెలకొంది.  ‘‘రాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్‌ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: