రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమాలు నిన్నటి రోజున ప్రారంభం అయ్యాయి. నిన్న ‘మహాశివరాత్రి’ మహా పర్వదినం కావడంతో  నిన్న అన్ని ఛానెల్స్ లోను యాంకర్ సుమ రాజమౌళితో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన రాజమౌళి మధ్యలో సుమ పై కోపం వచ్చి ఈ సినిమాలో దేవసేన పాత్ర కోసం తయారు చేసిన ఒక సొరంగం లాంటి జైలులో సుమను కొద్ది సేపు బంధించాడు.

దీనికి కారణం ఆఇంటర్వ్యూ కోసం అక్కడకు వెళ్లిన సుమ ‘బాహుబలి’  సెట్లో ఓ సెల్ఫీ తీసుకుంది. ‘బాహుబలి’ సెట్‌కు వచ్చే వారెవరూ కెమేరాలు, సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని, సెల్ఫీలు అసలు తీసుకోకూడదని జక్కన్న ఆర్డర్‌ వేసిన విషయంతెలిసి కూడ సుమ ఇలా చేయడంతో రాజమౌళి సుమను ఇలా  బంధించాడు. 
 
 అయితే తనను విడిపించమని సుమ ఎంతసేపు వేడుకున్నా ఎవరూ వినకపోయేసరికి ఆజైలు నుంచే  సుమ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసింది. ఆ తర్వాత తమ ‘బాహుబలి 2’ ఆడియో ఫంక్షన్‌ ప్రోగ్రామ్‌కు డబ్బులు తీసుకోకుండా హోస్ట్‌గా వ్యవహారిస్తానని మాట ఇస్తేనే జైలు నుంచి విడుదల చేస్తానని కండీషన్‌ పెట్టాడు రాజమౌళి. 

అందుకు సుమ అంగీకరించడంతో వెంటనే ఆమెను విడుదలచేసి ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాడు జక్కన్న. అయితే ఇది అంతా ఈ మూవీ ప్రమోషన్ కోసం చేసిన ఇంటర్వ్యూ అయినా ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అంతా తెగ ఎంజాయ్ చేసారు. దీనితో రానున్న రోజులలో ఇలాంటి వెరైటీ కార్యక్రమాలు  ‘బాహుబలి 2’ ప్రమోషన్ కోసం ఇంకా  ఎన్ని వస్తాయో అన్న కామెంట్స్ వినిపించాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: