తెలుగు ఇండస్ట్రీలో ఫైట్స్ లో నూతన ఒరవడి తీసుకు వచ్చిన హీరో సూపర్ స్టార్ కృష్ణ.  అప్పట్లో జెమ్స్ బాండ్, సీఐడీ తరహా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ.  ఈయన వారసుడిగా ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు.   పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పోకిరి’  చిత్రంతో ఎన్నో రికార్డులు సృష్టించాడు.  ఈ మద్య కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కాగా మహేష్ కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం కావడం మరో విశేషం.  
Image result for sudheer babu son charith
కృష్ణ వారసుడిగా ఆయన అల్లుడు సుదీర్ బాబు కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.  ఇక ఇండస్ట్రీలో మరో వారసుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు..అదే సుదీర్ బాబు తనయుడు చరిత్.మహేష్ బాబు మేనల్లుడు చరిత్ బాలనటుడి గా భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని చిన్నప్పటి రోల్ చేశాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రంలో కూడా నటించాడు .

సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి రోల్ పోషించాడు చరిత్ . అయితే సాహసానికి పూనుకున్నాడు ఈ చిన్నారి.    గుర్రాల ముందు పరుగెత్తే సీన్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు . గుర్రాల ముందు పరుగెత్తడం అంటే సాహసమే మరి . తాత , మేనమామ ల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నట్లు చరిత్ చేసిన సహసం చూసి చిత్ర యూనిట్ ఖంగు తిన్నారట.  తన తనయుడు విన్నర్ చిత్రంలో రిస్కీ షాట్స్ చేసాడని , అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు సుధీర్ బాబు.

సుదీర్ బాబు ట్విట్ :



మరింత సమాచారం తెలుసుకోండి: