తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య తమిళ హీరోల దూకుడు బాగా పెరిగిపోయింది.  ఇప్పటికే సూర్య, విజయ్, విక్రమ్,దనుష్ చిత్రాలు తెలుగు డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలోనే నడుస్తున్నాడు ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని. గతంలో ఆంటోనీ నటించిన  డాక్టర్ సలీమ్, నకిలీ పెద్దగా విజయం లభించలేదు..కానీ బిచ్చాగాడు చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.  తాజాగా విజయ్ ఆంటోని నటించిన  
 '' యమన్ ''  చిత్రం నిన్న రిలీజ్ అయ్యింది.  
Image result for yaman movies
తెలుగు , తమిళ భాషలలో రిలీజ్ అయిన యమన్ చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వస్తోంది . రాజకీయ క్రీనీడ నేపథ్యంలో తెరకెక్కిన యమన్ చిత్రం మనోడికి మంచి మార్కులే పడ్డాయి.  తనకు బాగా అచ్చి వచ్చే కథలను ఎంచుకొని తెలివైన నిర్ణయం తీసుకుంటున్నాడు అందుకే విభిన్న కథా చిత్రాల కథానాయకుడి గా పేరు తెచ్చుకున్నాడు .
Image result for yaman movies
తమిళంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం తో అప్పుడే సగం విజయం సాధించినట్లు భావించారు . ఇక విజయ్ ఆంటోనీ తెలుగు సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన పబ్లిసిటీ కూడా యమన్ కు కలిసి వచ్చింది. ఆ మద్య వచ్చిన ‘బేతాళుడు’ అట్టర్ ఫ్లాప్ కావడంతో తన తదుపరి చిత్రంపై మంచి శ్రద్ద పెట్టిన విజయ్ మొత్తానికి మంచి విజయాన్ని అందుకున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: