రాజమౌళి సినిమా అంటే అందులోని ఆర్టిస్ట్ ఎవరైనా సరే పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరచాల్సిందే. అసలు జక్కన్న ఎలా వారి దగ్గర నుండి అవుట్ పుట్ తీసుకుంటాడు అంటే తానో పెద్ద క్లాసే చెప్పాడు. ఆర్టిస్ట్ ను బట్టి రెండు మూడు రకాలుగా వారికి తాను సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తానని చెప్పిన రాజమౌళి శివగామి రమ్యకృష్ణకు అయితే డైలాగ్స్ మాత్రమే చెబుతానని ఇక ఆమె అంతా చూసుకుంటుందని అన్నాడు. 


బాహుబలి మొదటి పార్ట్ లో రాజమాత శివగామి ఎంత క్రేజ్ సంపాదించిందో తెలిసిందే. రమ్యకృష్ణ అనుభవం ఆ సినిమాకు చాలా ఉపయోగపడ్డది. ఆ పాత్ర కోసం శ్రీదేవిని సైతం అడిగి కాదనిపించుకున్న రాజమౌళి సినిమా అవుట్ పుట్ చూశాక రమ్యకృష్ణ గారే ఈ పాత్రకు కరెక్ట్ అని అనుకున్నాడట. ఇక ప్రస్తుతం చేస్తున్న బాహుబలి పార్ట్ 2 కు సంబందించిన పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న జక్కన్న ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారూ.


ఇక ఇప్పటి నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. శివరాత్రి కానుకగా గజ వాహనం ఎక్కుతున్న బాహుబలి పోస్టర్ వదిలిన రాజమౌళి సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాడు. ఇక సినిమా అవుట్ పుట్ గురించి చెబుతూ ప్రతి ఒక్క ఆడియెన్ అబ్బుర పడేలా సినిమా చేస్తున్నామని అన్నాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు న భూతో న భవిష్యత్ అన్న రీతిలో చేస్తున్నారట. ఇవన్ని చెబుతుంటే ఎప్పుడెప్పుడు బాహుబలి-2 చూసేద్దామా అనిపించడం మాములే.



మరింత సమాచారం తెలుసుకోండి: