ప్రస్తుతం మహేష్ అభిమానుల మధ్యనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మహేష్ మురగదాస్ ల మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి.  దాదాపు 100 కోట్ల భారీ ప్రాజెక్ట్ గా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ నిర్మాణం 70 శాతం పూర్తి అయినా కనీసం ఇప్పటి వరకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కూడ బయట పెట్టలేని పరిస్థితి కొనసాగుతోంది. 

దీనితో ఈ మూవీ టీజర్ విడుదల కూడ వాయిదా పడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా ఈమూవీ దర్శకుడు మురగదాస్ ఈసినిమా టైటిల్ ప్రకటించకుండానే ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. జూన్ 23న ఈమూవీ విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారు. 

దీనితో కనీసం ఫస్ట్ లుక్ కూడ బయటకు రాని సినిమాకు రిలీజ్ డేట్ ఏమిటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘సంభవామి’ అన్న టైటిల్ తో ఈమూవీ రిలీజ్ కాబోతోంది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నా ఈ మూవీ టైటిల్ విషయంలో మహేష్ అయోమయమే ఇంత ఆలస్యానికి కారణం అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈసినిమా టైటిల్ విషయంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు కొన్ని సంవత్సరాల క్రితం కొనసాగిన పాత పద్ధతులను అనుసరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు చిరంజీవి సినిమాల బూమ్ కొనసాగే రోజులలో అనుసరించిన పద్ధతులు ఇప్పుడు మహేష్ లేటెస్ట్ మూవీ విషయంలో అనుసరిస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. 

గతంలో చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’, ‘మాస్టర్’, ‘మృగరాజు’ లాంటి సినిమాల ప్రమోషన్ కోసం టైటిల్ మీరే పెట్టండి అంటూ అభిమానులకు పెట్టిన ఒపీనియన్ పోల్ లా ఇప్పుడు మహేష్ మురగదాస్ ల మూవీకి కూడ ఇలా రెండు దశాబ్దాల వెనక్కి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ‘సంభవామి’ అంటూ పెట్టిన పేరు మరీ ట్రెడిషనల్ గా ఉందని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఈ మూవీకోసం  కొత్త టైటిల్ కోసం ఐదు అషన్స్ క్రియేట్ చేసి ఫ్యాన్స్ తోనే ఫైనల్ చేయించుకోవాలని మురగదాస్ మహేష్ లు ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈమూవీ టైటిల్ గురించి తిరిగి యూటర్న్ తీసుకుని అనుసరిస్తున్న పాత పద్ధతులు వల్ల అయినా ఈ మూవీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: