టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీర‌లో హాట్ టాక్స్ గా మారిన చిత్రం ఏదైనా ఉందంటే అది బాహుబ‌లి2 అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌సుత్తం ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ యాక్టివిటీస్‌ స్టార్ట్ అయ్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వివ‌రాల్లో వెళితే...ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో భారీ బిజినెస్ ని సొంతం చేసుకుంటున్న చిత్రంగా బాహుబ‌లి2కి పేరు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది. రికార్డ్ స్థాయిలో ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ జ‌రుగుతుంది.


వీటికి సంబంధించిన వివ‌రాల‌ను చూస్తే...దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి-2’. మొదటి భాగం అద్భుత విజయాన్ని సాధించడంతో రెండో భాగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్‌ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేసుకుంది.


ఈ పోస్ట‌ర్ ఒక్క‌సారిగా బాహుబ‌లి2 బిజినెస్ పై క్రేజ్ ని క్రియేట్ చేస్తుంది. ‘సాహోరే బాహుబలి...అంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనే కామెంట్ పోస్ట‌ర్ పై ఎప్పుడైతే వ‌చ్చిందో...అన్ని ఏరియాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూట‌ర్స్ బాహుబ‌లి2 రైట్స్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీని కారణంగా భారీ స్థాయిలో థియోట్రిక‌ల్ రైట్స్ ప‌లుకుతున్నాయి. ఏనుగు తొండంపై ప్రభాస్‌ నిలబడి ఉన్న ఈ స్టిల్‌ అభిమానులను ఎంతగానో అలరిస్తుందో...బిజినెస్ వ‌ర్గాల‌ను సైతం అంతే ఉత్తేజ‌ప‌రుస్తుంది.


ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్ ప్ర‌కారం సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కూ బాహుబ‌లి2కి దాదాపు 150 కోట్ల రూపాయ‌ల బిజినెస్ ఏరియా రైట్స్ ద్వారా జ‌రిగిందని, ఇక బాలీవుడ్ లో 100 కోట్ల రూపాయ‌ల బిజినెస్‌ జ‌రిగింద‌నే టాక్స్ అంత‌టా వినిపిస్తున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తుంటే బాహుబ‌లి2కి ఏరియా బిజినెస్ ఓ రేంజ్ జ‌రుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: