కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైభంగా పెళ్ళి చేసుకున్న సినీ జంట అమలాపాల్‌-విజయ్. దాదాపు 3 సంవత్సరాలుగా పెళ్ళి ప్రేమించుకున్న ఈ జంట చివరికి పెళ్ళి చేసుకున్న కొద్ది కాలానికే విడాకుల బాట పట్టింది. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మందికి షాకింగ్ లా మారింది. ఇక విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన వీరికి తాజాగా కోర్టు విడాకులను మంజూరుచేసిన విషయం తెలిసిందే. జ్యూడీషియల్‌ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి విడాకులు మంజూరయ్యాయి. 


2014 జూన్‌ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్ళి తరువాత సినిమాలకి దూరంగా ఉండాలన్నది విజయ్ తల్లిదండ్రుల నిబంధన. అత్తింటి వారి నిబంధనను అమలపాల్ వ్యతిరేకించటంతో పరిస్థితి విడాకుల వరకూ వచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ తన కెరీర్‌ పై పూర్తిగా దృష్టిని ఉంచింది. తను ఎప్పుడైతే సినిమాలపై ఫోకస్ పెట్టిందో…అప్పటి నుండి తనకి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలాపాల్‌ చేతిలో దాదాపు అరడజనుకి పైగా ఆఫర్లు ఉన్నాయి.


అంతే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి తరువాతే అమలాపాల్‌ కెరీర్ స్పీడు అందుకుందని అంటున్నారు. ఇదిలా ఉంటే అమలాపాల్‌ ని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో వెంటపడుతున్నాడని అంటున్నారు. గత కొద్ది నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.


కోలీవుడ్ లో దీనికి సంబంధించిన టాక్స్ జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ప్రవేట్ ఫంక్షన్ కి వచ్చిన విజయ్ కి అమలాపాల్‌ మరో యంగ్ హీరోతో కలిసి రావటం చూశాడంట. ఆ సమయంలో అమలాపాల్‌ ని అలా చూడటం విజయ్ కి షాక్ ని ఇచ్చిందని అంటున్నారు. మాజీ భర్త ముందు ఉండానే మరో ప్రియుడితో కనిపించటం అనేది అక్కడ ఉన్నావారికి సైతం కాస్త కొత్తగా అనిపించిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: