ప్రస్తుతం అక్కినేని అఖిల్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలో ఏవార్త బయటకు వస్తుందో అనే టెన్షన్ ఇండస్ట్రీలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే ఈ హీరో మాత్రం ఇప్పుడు తన ఫిల్మ్ కెరీర్ ని ఓ గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా పెద్ద చిత్రాలు, పెద్ద డైరెక్టర్స్ కాంబినేషన్స్ అంటూ చూడకుండా మంచి కథ దొరికితే ముందుకు వెళదాం అన్నట్టుగా అఖిల్ తన ఫిల్మ్ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.


అందుకే ఓ సరికొత్త ఫార్ములాతో అఖిల్ ముందుకు వెళుతున్నాడు. తొలి సినిమా `అఖిల్‌` భారీ ప‌రాజ‌యం త‌న‌ని చాలానే బాధించింది. కానీ ఈ చిత్రంలో తన న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్‌ బాగున్నాయనే గుడ్ టాక్ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. దీంతో అఖిల్ కి తన మొదటి చిత్రం ద్వారా జరిగిన మంచిలో ఇది ఒకటి. ఇక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబ‌ట్టుకోవాల‌న్న ఫార్ములాను అఖిల్ బలంగా నమ్ముతున్నాడు.


ఇందుకు తండ్రి నాగార్జున స‌పోర్ట్ తీసుకొని తన రెండో చిత్రాన్ని డైరెక్టర్ విక్ర‌మ్ తో జతకడుతున్నాడు. ఇప్పటికే విక్ర‌మ్ క‌థ‌ను సిద్ధం చేసి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకువెళ్ళనున్నాడని అంటున్నారు. ఇంతటితో ఆగకుండా అఖిల్ ఇప్పుడు మూడో చిత్రానికి సంబంధించిన కథా చర్చలను సైతం ప్రారంభించారు. ఇప్పటికే ఇత‌ర ద‌ర్శ‌కుల‌తోనూ మంత‌నాలు సాగిస్తున్నారు.


త్వరలోనే తన మూడో చిత్రానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ని అఖిల్ ఇవ్వనున్నాడనే న్యూస్ అన్నపూర్ల స్టూడియో కాంపౌండ్ నుండి వినిపిస్తుంది. అలాగే అఖిల్ నాలుగో చిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ల స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారని అంటున్నారు. ఇలా అఖిల్ తన వరుస చిత్రాలతో బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మేటర్స్ ఎలా ఉన్నప్పటికీ…తన ఫిల్మ్ కెరీర్ మాత్రం ఇక నుండి జెట్ స్పీడుతో వెళ్ళనుందని క్లియర్ గా చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: