సొంతఊరు, గంగ‌పుత్రులు సినిమాలో మంచి ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు పి.సుశీల్‌కుమార్ రెడ్డి. అయితే ఏం లాభం..?  ఆ సినిమాల‌తో అవార్డులొచ్చాయి గానీ డ‌బ్బులు రాలేదు. క‌నీసం పెట్టుబ‌డి తిరిగి రాలేదు. వెంట‌నే గేరు మార్చి, కొత్త‌వారితో ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ తీశాడు. ప్రేమ పేరుతో యువ‌త ఎలా పెడ‌తారి ప‌డుతున్నారో కాస్త మ‌సాలా జోడించి చూపించాడు. ఆ సినిమా పోస్ట‌ర్లు కూడా కాస్త ఆస‌క్తిని ర‌గిల్చాయి. అమ్మాయి, అబ్బాయిల‌ను ముసుగులో చూపించాడు. దాంతో విడుద‌ల కు ముందు మాంఛి ప‌బ్లిసిటీ ద‌క్కింది.

ఇప్పుడు కూడా సుశీల్ కుమార్ రెడ్డి అదే పంథాలో వెళ్తున్నాడు. వెయిటింగ్ ఫ‌ర్ యు అనే సినిమా తీస్తున్నాడు. ఒక పెళ్లికాని అమ్మాయి ప్రేమ క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌లైంది. ఓ తొమ్మిది నెల‌ల గ‌ర్భ‌వ‌తిని పోస్ట‌రు పై చూపించాడు. ఓ ఫిల్మ్ బై.. ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ‌.. అని కూడా పెట్టారు. అంటే అమ్మాయిలు పెళ్లికాక‌ముందే క‌డుపులు తెచ్చుకొంటున్నారు అనే క‌దా??

��

కొన్ని దృశ్యాలు మ‌నం ఫొటోల రూపంలో, అందునా పోస్ట‌ర్లుగా చూడ‌డానికి ఇష్ట‌ప‌డం. అయితే సుశీల్ కుమార్ రెడ్డి మాత్రం.. ఓ గ‌ర్భ‌వ‌తిని అందునా పెళ్లి కాని అమ్మాయి ఫొటోని పోస్ట‌రుగా తీసుకొచ్చాడు. మొత్త‌మ్మీద రొమాంటిక్ క్రైమ్ క‌థ పోస్ట‌రుతో ఎంత ఆస‌క్తిని సృష్టించాడో అంత‌కంటే ఎక్కువ ఆస‌క్తిని ఈ పోస్ట‌రుతో తీసుకురాగ‌లిగాడు. మ‌రి సినిమాలో ఏ విష‌యాల‌ను చ‌ర్చిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: