ఈ మద్య బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి.   పెద్ద సినిమాలు ఒకటీ రెండు వస్తుంటే..ఇలాంటి బి గ్రేడ్ చిత్రాలు పదుల సంఖ్యలో వస్తున్నాయి.  ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయ్యే ముందు నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం సినిమాపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసుకోవడం పరిపాటైంది.  తాజాగా ఇదే కోవలోకి వెళ్తుంది.. ప్రకాశ్ జా నిర్మించిన లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా.   లిప్ స్టిక్ అండర్  మై బుర్ఖా చిత్రంలో బూతు సన్నివేశాలు చాలా ఉన్నాయట దాంతో ఆ సినిమాకు సెన్సార్ చేయలేమని చేతులు ఎత్తేసారు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు.  ఈ సినిమాలో అడల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సీబీఎఫ్‌ సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

 ప్రకాశ్ ఝా ఫిలిం బేనర్ పై అలంకృత శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కింది లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా మూవీ. నలుగురు వేర్వేరు వయసుగల మహిళల జీవిత ప్రయాణం ఈ సినిమా ఇతివృత్తం. సమాజంలోని అనేక ఆంక్షల నడుమ వాళ్లు ఏం కోరుకుంటున్నారో, ఎలాంటి స్వేచ్ఛను అనుభవించాలని తపన పడుతుంటారో, పైకి చెప్పలేని వాళ్ల కోరికలేంటో తెరమీద ఆవిష్కరించారు. రత్న పథక్ షా, కొంకణసేన్, ఆహన కుమార, ప్లైట్ బోర్థాకుర్ ఆ నలుగురు మహిళల పాత్రలు పోషించారు.  

లిప్ లాక్ సీన్లు మాత్రమే కాదు సెక్స్ సీన్లు కూడా చాలానే ఉన్నాయట , పైగా ఓ వర్గానికి చెందిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో అవి వివాదాస్పదం అయ్యేలా ఉన్నాయట దాంతో సెన్సార్ చేయలేమని చేతులు ఎత్తేసారు సెన్సార్ సభ్యులు . పైగా మహిళా దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. మహిళల సమానత్వం , సమస్యలపై తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద వివాదం సృష్టించేలాగే ఉంది . ఇక ఈ ట్రైలర్ కూడా బూతు సన్నివేశాలతో నిండిపోయింది.  అయితే , తాము రూల్స్ ప్రకారమే వ్యవహరించామని సీబీఎఫ్ సీ సీఈవో అంటున్నారు. కావాలంటే చిత్ర యూనిట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చన్నారు.

mamatha


మరింత సమాచారం తెలుసుకోండి: