ఈ మధ్యా కిడ్నాప్ అయిన హీరోయిన్ భావన వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే భావన కిడ్నాప్ కథ ఇప్పుడు సుఖాంతం అయిన వెంటనే తన పెళ్లికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఇప్పుడు స్టార్ హీరోయిన్ భావనపై జరిగిన కిడ్నాప్ దాడి చిత్ర పరిశ్రమల్లోనూ సంచలనం రేపింది.


అయితే ఈ న్యూస్ ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా వినిపిస్తుంది. కొంత మంది భావనని అత్యాచారం చేశారని…మరికొంత మంది భావనని కిడ్నాపర్లు నగ్నంగా చిత్రీకరించారని ఇలా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా భావనపై వస్తున్న పుకార్లు చూస్తుంటే ఏది నిజమో…ఏది అబద్ధమో అస్సలు నమ్మలేకపోతున్నారు. అయితే భావన ఇచ్చిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం…బయటకు వస్తున్న న్యూస్ లు అన్నీ పుకార్లే అని తేలిపోయింది.


పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం భావన పై ఎటువంటి అత్యాచార ప్రయత్నం జరగలేదని తెలిసింది. కేవలం ఫోటోలు మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది. ఇక మలయాళ దర్శకుడు ప్రియదర్శి కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక భావన మాట్లాడిన మాటల్లోనూ తనపై అత్యాచారం జరగలేదని..కిడ్నాపర్స్ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని తెలిపింది.


ఇదిలా ఉంటే ఇప్పుడు భావన త్వరలోనే వివాహం చేసుకోనుందని అంటున్నారు. ప్రముఖ నిర్మాత ఈ కష్ట సమయంలో భావనకు సపోర్ట్ గా ఉండటంతో…తనతోనే పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే వీటికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. త్వరలోనే ఈ వివరాలపై ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం కిడ్నాప్ తో జరిగిన రచ్ఛ సద్ధుమణగాలంటే తను పెళ్ళి చేసుకోవాల్సిందేనని భావన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు వచ్చింది కాదని…గత రెండు సంవత్సరాలుగా అనుకున్నదే అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: