తెలుగు సినిమా మార్కెట్ ని ఒక్కసారిగా పదింతలు చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఒక్క బాహుబలి మాత్రమే. ఒక తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మర్కెట్ విలువ దాదాపు 600 కోట్ల రూపాయలు అని లెక్కలతో తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఒక్క కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే సౌత్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది అని భావించారు.


కానీ బాహుబలి ఎంట్రి తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ తరువాత స్థానం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే అని తెలిసొచ్చింది. ఇదిలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి2 మూవీకి సంబంధించిన హిందీ రైట్స్ ప్రస్తుతం హాట్ టాక్స్ లా మారింది. గతంలో బాహుబలి రైట్స్ ని కొన్న బాలీవుడ్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కి దాదాపు50 కోట్లరూపాయల లాభాలు వచ్చాయి. ఇప్పుడు కూడ బాహుబలి2ని హిందీతో పాటు ఇతర దేశాల్లో రిలీజ్ చేసేందుక ధర్మ ప్రొడక్షన్స్ భారీగా ప్రయత్నాలు చేస్తుంది.


గతంలో కేవలం 15 కోట్ల రూపాయలకి రైట్స్ ని సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు బాహుబలి2 కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను పెడుతుందని అంటున్నారు. బాహుబలి2 కచ్ఛితంగా హిందీలోనూ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అంటున్నారు. అందుకే హిందీ రైట్స్ కి భారీ డిమాండ్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇతర ఏరియాల సంబంధించిన రైట్స్ సైతం భారీగానే ఉన్నాయి. తెలుగు మార్కెట్ విషయానికి వస్తే నైజాం రైట్స్ కి భారీ డిమాండ్ వస్తుంది.


బాహుబ‌లి 2కు నైజాం రైట్స్ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల నైజాం రైట్స్ 13 కోట్ల రూపాయలతో అత్యధికంగా నిలిచింది. అలాంటిది ఇప్పడు బాహుబలి2 కి ఏకంగా 20 కోట్ల రూపాయలు అంటే ఈ మూవీపై మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. మొత్తంగా బాహుబలి2 ఈసారి ఓ రీజనల్ ఫిల్మ్ గా కాకుండా నేషనల్ ఫిల్మ్ అనే భావన ప్రేక్షకుల్లో రావటమే ఈ మూవీపై  హైప్ క్రియేట్ అవ్వటానికి కారణం అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: