రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి బిగినింగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్-2 కూడా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందని ఊరిస్తున్నాడు జక్కన్న. ఇక సినిమా రిలీజ్ ఏప్రిల్ 28 అఫిషియల్ గా చెప్పిన చిత్రయూనిట్ ఆడియోని కూడా మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆడియో వెన్యూనే ఎక్కడ బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.


మొదటి పార్ట్ ఆడియోని తిరుపతిలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈసారి వెన్యూ వైజాగ్ కు మార్చాలని చూస్తున్నారట. అయితే ఫ్యాన్స్ మాత్రం తిరుపతిలో రిలీజ్ చేయబట్టే సినిమా 600 కోట్ల దాకా వసూళు చేసిందని ఆ సెంటిమెంట్ తోనే పార్ట్ 2 ఆడియో కూడా అక్కడే రిలీజ్ చేయమని అంటున్నారట. రాజమౌళి అండ్ టీం మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏవి ఫాలో అవ్వమని వైజాగ్ లోనే బాహుబలి-2 ఆడియో ఉంటుందని అంటున్నారు.


ఇక బాహుబలి బిగినింగ్ లో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేశామని పార్ట్-2 లో ఆడియెన్స్ ను ఆబురపరచే అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు రాజమౌళి. సినిమా మరో ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ క్యారక్టర్స్ తో బాహుబలి-2 కథ పూర్తి అవుతుందని.. కాకపోతే మళ్లీ దీన్ని కొనసాగించే ఆలోచన ఉందని అన్నాడు జక్కన్న. ఈ కథకు ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి మరో కథతో బాహుబలిని పొడిగించే అవకాశం ఉందట.



మరింత సమాచారం తెలుసుకోండి: