ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నాని నేను లోకల్ తో పాటుగా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వచ్చిన రానా ఘాజి కూడా అదరగొట్టాయి. నాని నేను లోకల్ ఏకంగా నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా క్రేజ్ తెచ్చుకోగా ఘాజి కూడా ఊహించని రేంజ్లో వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇక ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ కలక్షన్స్ సాధించాయి.


నాని నేను లోకల్ మూవీ ఇప్పటిదాకా 7.16 కోట్ల కలక్షన్స్ సాధించగా.. ఘాజి సినిమా 4.32 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. సినిమా అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తీసుకొచ్చింది. ఘాజితో రానా మరోసారి తన ప్రయోగాలకు ప్రాణం పోయగా.. నాచురల్ యాక్షన్ తో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు వేరు వేరు జానర్ సినిమాలు అవడంతో రెండు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి.


ఈమధ్య కాలంలో ఓవర్సీస్ మార్కెట్ పై తెలుగు సినిమాల హవా మళ్లీ పుంజుకుందని చెప్పొచ్చు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ మార్కెట్ ముఖ్యంగా ఓవర్సీస్ కలక్షన్స్ పై ఆధారపడటం విశేషం. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన సాయి ధరం తేజ్ విన్నర్ అక్కడ అంతగా ప్రభావితం చూపించలేదు. ఇక రాబోతున్న సినిమాలు కూడా ఒవర్సీస్ మీద దృస్టి పెట్టాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: