ప్రిన్స్ మహేష్ హవా నేడు నడుస్తోంది అతడి  పేరు చెబితేనే యువత ఉత్సాహంగా ఊగిపోతు న్నారు  అమ్మాయిలు కలల్లో తేలిపోతున్నారు. ప్రస్తుతం  టాలీవుడ్లో అందగాడు ఎవరంటే మొదటి పేరు చెప్పేది  మహేష్ పేరే అటు నిర్మాతలు ఇటు బ్రాండ్స్ మహేష్ కోసం కాపు కాస్తున్నాయి. అటువంటి ఈ టాలీవుడ్ ప్రిన్స్ కు మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు   విదేశాల్లో కూడా   చాలామంది  ఫాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే  అయితే  ఆ ఫాలోయింగ్ ఇంత ఉందా అన్న సంఘటన ఈ మధ్య జరిగింది.

 సుకుమార్ దర్శకత్వం మహేశ్  నటిస్తున్న ‘1’ సినిమా షూటింగ్ ఐర్లాండులో జరగుతోంది. అక్కడి బెల్ ఫాస్ట్ అనే నగరంలో ఓ భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు. షూటింగుకి అంతా సిద్ధమైంది. అంతలోనే కొందరు అపరిచిత వ్యక్తులు బిల బిలా మంటూ  వచ్చారట  వారంతా ఎవరా అని ఆరాతీస్తే తెలిసింది... మహేశ్ బాబు ఫ్యాన్స్ అని, అంతే కాదు  అందరూ అతడిని చుట్టుముట్టేశారు. కబుర్లలో ముంచెత్తారు, ఆటోగ్రాఫులు తీసుకున్నారు. కరచాలనాలు చేసి మురిసిపోయారు.

ఇదంతా చూసి ఫిల్మ్ యూనిట్ వారు  ఈ దేశంలో మహేశ్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారట. ప్రిన్స్ కూడా కాస్త షాక్ తిన్నాడట అంతమంది ఫ్యాన్స్ ని చూసి. సో ఇక మహేష్ సినిమాలు ఐర్లాండ్ లో కూడా విడుదల చేస్తే బాగుంటుందే మో.!!

మరింత సమాచారం తెలుసుకోండి: