మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత నటించిన ఖైది నంబర్ 150 ఎంతటి సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే.. లేట్ గా వచ్చినా సరే లేటెస్ట్ రికార్డులన్ని పని పడతా అని చిరు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కు అందరు షాక్ అయ్యారు. బాక్సాఫీస్ మీద చిరంజీవి చూపించిన ఈ ప్రభంజనం అంతా ఇంతా కాదు. 150వ సినిమా ఏ రేంజ్ లో ఉండాలనుకున్నారో అంతకంటే ఎక్కువ రేంజ్ కే ఖైది నంబర్ 150 ఆడింది.


ఇక తర్వాత సినిమా డెశిషన్ తీసేసుకున్న చిరంజీవికి మళ్లీ హెడేక్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. అదెలా అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను చిరు 151వ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాలో చిరంజీవి లుక్ కోసం కొన్ని స్కెచ్ లు వేయిస్తున్నారట. ఓ పక్క దర్శకుడితో పరుచూరి బ్రదర్స్ కూడా కథా చర్చల్లో ఉన్నారని తెలుస్తుంది. 


ఇప్పటిదాకా వేసిన స్కెచ్ లు ఏవి చిరుకి నచ్చలేదట. తన ఇమేజ్ ను ఏమాత్ర తగ్గించకుండా చిరంజీవి సినిమాలో లుక్ ఉండాలని భావిస్తున్నాడు. ఇప్పటికే తన ఓల్డ్ గెటప్ లో నటించిన స్నేహం కోసం, రిక్షావోడు ఫ్లాప్ అవడంతో చిరు ఆ లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఫైనల్ లుక్ ఏది అవుతుందో అని కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి తన పంజా విసరాలని చూస్తున్నాడు. ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: