ఒకనాటి హీరోయిన్ రోజా ప్రస్తుతం టీవి యాంకర్ గా మారి కొన్ని రియాలిటీ షోలు చేయడమే కాకుండా కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ మధ్య ఈమె నాగబాబు తో కలిసి ‘జబర్దస్త్’ అనే రియాలిటీ షోకు న్యాయ నిర్ణీత గా వ్యవహరిస్తోంది. ఈ షో ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్న నల్ల వేణు తను ఒక రజనీ కాంత్ లా ఫీలవుతూ తరుచూ పంచ్ డైలాగ్స్ విసురుతూ ఈ షోను రక్తి కట్టిస్తున్నాడు.

ఇంత వరకూ బాగానేవుంది కానీ నల్ల వేణు మరొక అడుగు ముందుకు వేసి రోజాను నాగబాబు ను టార్గెట్ చేస్తూ వేస్తున్న జోక్స్ కు ఈ షోను చూస్తున్న ప్రేక్షకులతో పాటుగా న్యాయ నిర్ణీతలుగా వ్యవహరిస్తున్న రోజా నాగబాబులు కూడా ఆనంద పడుతున్నారు. ఇంతకీ ఆ జోక్స్ ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఇదుగో చదవండి ‘అతిగా మేకప్ చేసుకునే  రోజా – మరీ అతిగా నవ్వే నాగబాబు నిర్వహించే ఏకైక రియాలిటీ షో జబర్దస్త్’ అంటూ రోజా మేకప్ పై సెటైర్లు వదలడమే కాకుండా స్టేజ్ మీద ఒక మూలగా ఉన్న కుప్పను చూపెడుతూ ప్రతి రోజు రోజా మేకప్ తుడిచేసుకోవడంతో ఏర్పడిన కుప్ప అని జోక్స్ వేస్తుంటే ఆ షోకు వచ్చిన వారుతో సహా రోజా, నాగబాబులు కూడా తెగ అనందిస్తున్నారట.

రోజా అసలు స్వరూపం బ్లాక్ మరి ఆమాత్రం మేకప్ చేసుకోపోతే ఎలా మరి? షో గురించి మాట్లాడకుండా రోజా మేకప్ గురించీ, నాగబాబు వవ్వు గురించి నల్ల వేణు కామెంట్ చేయడం వారిని పోగిడినట్లా? లేక విమర్శించి నట్లా అనేకామెంట్ వినిపిస్తోంది...  

మరింత సమాచారం తెలుసుకోండి: