కెరీర్ మొదటిలోనే ప్రిన్సు మహేష్ బాబు ఇద్దరు హీరోయిన్లతో యువరాజుగా దర్శన మిచ్చాడు. సాక్షి శివానంద్సిమ్రాన్లతో పాటు ఈ మూవీలో మహేష్ కి ఓ కొడుకు కూడా ఉంటాడు. అంత తక్కువ ఏజ్ లోనే ఓ బాబుకి తండ్రిగా మహేష్ ని చూడటం ప్రేక్షకులకు కొంచెం కష్టంగానే అనిపించింది. మరి మళ్ళీ తాజాగా మహేష్ యువరాజుగా చేస్తున్నాడంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. 

 

అయితే మహేష్ బాబు ఇంకా ఈ యువరాజు పాత్ర గురించి వినడమే కాని చేస్తాను అని మాట ఇవ్వకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చు కుంటున్నారు. వివరాల్లోకి వెళితే అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ చేస్తున్న రుద్రమదేవి మూవీలో యువరాజు పాత్ర ఒకటి ఉందనిఆ పాత్ర కోసం గుణశేఖర్ మహేష్ బాబుని సంప్రదించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. 

 

ఇప్పటకే ఈ మూవీలో రానా ఓ పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. మరి మహేష్ కూడా ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ రాజమౌళి బాహుబలి కంటే ఎక్కువగా హైప్ ని క్రియేట్ చేయడం ఖాయం. కానీ మహేష్ మరోసారి యువరాజుగా చేసేందుకు ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదని టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: