టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా మారే క్ర‌మంలో.. సిద్దార్థ్ ప్రేమ‌లో ప‌డిపోయింది స‌మంత‌. వ్య‌క్తిగ‌త జీవితం సంగతేమో గానీ, వృత్తిగ‌తంగా ఆమె కెరీర్ డోలాయ‌మానంలో ప‌డ‌డానికి కార‌ణం సిద్దూతో దోస్తీనే. స‌మంత ఇప్పుడు పూర్తిగా సిద్దూ హ్యాంగోవ‌ర్ లో ఉంది. ఏ సినిమా ఒప్పుకోవాల‌న్నా, ఏది రిజెక్ట్ చేయాల‌న్నా పూర్తిగా సిద్దూ చేతిలో ఉంద‌ట‌. స‌మంత సిద్దూకి పూర్తిగా లొంగిపోయింద‌ని, కీలుబొమ్మ‌లా మారిపోయింద‌ని.. ప‌రిశ్ర‌మ టాక్‌!

ఈమ‌ధ్య స‌మంత చాలా ఆఫ‌ర్లు వ‌దులుకొంది. దానికి కార‌ణం సిద్దూనేన‌ట‌. ఫ‌లానా సినిమా చేయ‌కు అని ఆర్డ‌రేస్తే అది గుడ్డిగా ఫాలో అయిపోదంద‌ట‌. అంతే కాదు మీడియా ముందు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడ‌కూడ‌దో సిద్దూనే డిసైడ్ చేస్తున్నాడ‌ట‌.

��

అంతెందుకు.? స‌మంత ట్విట్ట‌ర్ ఎకౌంట్ కూడా ఆమ‌ధ్య కొన్నిరోజులు మూత‌బ‌డింది. అది కూడా సిద్దూ ఎఫెక్టే అని తెలిసింది.స‌మంత కెరీర్ పూర్తిగా రాంగ్ డైరెక్ష‌న్‌లో ఉందిప్పుడు. మ‌రి సిద్దూ స‌మంత‌ను ఏవైపుకు తీసుకెళ్తాడో??

మరింత సమాచారం తెలుసుకోండి: