‘బాహుబలి 2’ షూటింగ్ పూర్తి కావడంతో ఆ మూవీకి సంబంధించిన వార్తలు ఒకొక్కటిగా బయటకు వస్తూ ఆసినిమా పై క్రేజ్ ను పెంచడమే కాకుండా ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అన్న దిశలో అంచనాలు పెరిగిపోతున్నాయి. 1000 కోట్ల కలక్షన్స్ లక్ష్యంగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 

ఈసినిమాను విడుదల అయ్యాక బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 ‘బాహుబలి 2’ సినిమాను చూడబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన ఈ న్యూస్ ఇలా బయటకు రావడానికి ఒక కారణం ఉంది. 

ఈ సంవత్సరం రాబోతున్న ఆగస్టు 15తో భారత దేశానికి బ్రిటీష్ వారి దగ్గర నుండి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతోంది. ఆ సందర్భంగా బ్రిటీష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ వారు మన సినిమాలకు గౌరవిస్తూ ఒక ప్రోగ్రామ్ ను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈకార్యక్రమంలో ‘బాహుబలి 2’ ను ప్రదర్శించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవెంటుకు బ్రిటన్ మహారాణి చీఫ్ గెస్ట్ గా వస్తోంది అన్న వార్తలు లండన్ మీడియాలో వస్తున్నాయి.  

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి కూడా వెళతారని తెలుస్తోంది. కాకపోతే ‘బాహుబలి 2’ సినిమా రెండు గంటలు పైగా ఉంటుంది కాబట్టి అంత సినిమాను చూసే ఓపిక బ్రిటీష్ మహారాణికి ఉండదు కాబట్టి ఈసినిమా నిడివిని బాగా తగ్గించి ఒక ప్రత్యేకమైన షోగా వేసే ఆలోచన ఉంది అని అంటున్నారు.

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియని నేపధ్యంలో ‘బాహుబలి 2’ క్రేజ్ ను పెంచడానికి ఈ వార్తను క్రియేట్ చేసి ఉంటారు అన్న అనుమానాలు కూడ కొందరు వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను భాగ్యనగరంలోని రామోజీ ఫిలిం సిటీలో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి మార్చి 28న నిర్వహించాలని రాజమౌళి ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్. అయితే ‘బాహుబలి 2’ ఆడియోను హైదరాబాద్ తో పాటుగా మరికొన్ని ప్రధాన నగరాలలో కూడ నిర్వహించే ఆలోచన ఉంది అని అంటున్నారు. ఏమైనా ఉగాది నుండే ‘బాహుబలి 2’ హంగామా మొదలవుతున్నట్లే అనుకోవాలి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: