ఈనెల 30 వ తారీఖున జరగవలసిన ‘ఎవడు’ ఆడియో వేడుక వాయిదా పడుతున్నట్లుగా విశ్వసినీయంగా తెలియవస్తోంది. ఇంకా అధికారికంగా దీని విషయమై ప్రకటన వెలువడనప్పటికీ ఎవడు ఆడియో వేడుకను ఈనెల 30 న కాకుండా జూలై 1 కి మార్చమని చిరంజీవి నిర్మాత దిల్ రాజు కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి కారణంగా కొన్ని సెక్యూరిటీ సమస్యల వల్ల ఈ వేడుకను వాయిదా వేస్తునట్లు చెప్పినప్పటికీ దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ రాక గురించే అని అంటున్నారు.

 అనుకున్న ప్రోగ్రాం ప్రకారంతన ‘అత్తారింటికి దారేది’ షెడ్యుల్ పూర్తి చేసుకొని పవన్ ఈనెల 30 వ తారీఖున రాజధాని రావలసి ఉన్నా, అనుకోని ఫ్లైట్ అవాంతరాల వల్ల పవన్ రాక ఆరోజు ఆలశ్యం అయితే ఈ కార్యక్రమానికి పవన్ మిస్ అవుతాడు కాబట్టి ఎట్టి పరిస్తితులాలోను ఎవడు ఆడియో వేడుక వేదికపై పవన్ ఉండేటట్లుగా అన్ని జాగ్రత్తలు మెగా స్టార్ చిరంజీవి తిసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి రామ్ చరణ్ యూరప్ లో ఉన్న పవన్ తో ఫోన్ లో మాట్లాడాడని, తాను ఆడియో వేడుకకు వస్తానని పవన్ చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అదీ కాక ప్రస్తుత రాజకీయ అనిశ్చితి పరిస్థితులలో ఏరోజు ఎక్కడ చిరంజీవి ఉండాల్సి వస్తుందో తెలియదు కాబట్టి పవన్ లేకుండా ఈ కార్యక్రమం తలపెట్టవద్దని, అలా చేస్తే అటు చిరంజీవి లేక ఇటు పవన్ లేకుండా వేదిక బోసి పోతుంది కాబట్టి మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముడి రాక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

 అదీకాకుండా 30 తారీఖున కాంగ్రెస్ తెలంగాణా వాదుల సదస్సు కూడా జరుగుతోంది కాబట్టి సెక్యూరిటీ కారణాల రిత్యా కూడా ఎవడు ఆడియో వేడుక ఒక రోజు వాయిదా పడిందని అంటున్నారు. ఈ వేదికపై మెగా బ్రదర్స్ యొక్క స్టామినా ను చూపించాలని చిరు చాలా పట్టుదల మీద ఉన్నాడట. అన్నీ కుదిరితే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ పరిచయం కూడా ఈ వేదిక నుంచే జరిపించాలని మెగా ఫ్యామిలీ ఆలోచన అని అంటున్నారు. పవన్, చిరంజీవి, రామ్ చరణ్ లు ఒకే వేదికపై ఉంటే చాలు అది మెగా అభిమానులకు పండుగే. దీని గురించి ఒక రోజు ఆలశ్యం కాదు ఎన్ని రోజులు ఆలశ్యం అయినా మెగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: