మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత నంది అవార్డుల హడావిడి కనిపించకుండా పోయింది. అయితే మళ్ళీ ఆ హంగామా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు సంబంధించి నండీ అవార్డుల కోసం 2012, 2013 సంవత్సరాలకు జయసుధ కోడిరామకృష్ణల ఆద్వర్యంలో నియమింప బడ్డ కమిటీలు తమ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందచేసారు. జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ ఛైర్మన్లుగా వ్యవహరించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తరువాత మీడియాకు ఈ అవార్డుల వివరాలను విడుదల చేసారు. అయితే అనూహ్యంగా టాలీవుడ్ కలక్షన్స్ చరిత్రను తిరగ వ్రాసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డును ఇచ్చినప్పటికీ ఈ మూవీలో నటించి టాలీవుడ్ ఎంపరర్ గా మారిన పవన్ కళ్యాణ్ కు ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం ఒక షాకింగ్ ట్విస్ట్ మాత్రమే కాకుండా పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గరి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ‘బాహుబలి’ సినిమా ద్వారా జాతీయ స్థాయి పురస్కారాలు వస్తాయి అనుకున్న ప్రభాస్ అభిమానుల కలలను ‘బాహుబలి’ తీర్చలేకపోయినా ‘మిర్చి’ సినిమాలో నటించిన ప్రభాస్ కు ఉత్తమ నటుడు అవార్డు రావడం సంచలన వార్తగా మారడమే కాకుండా ప్రభాస్ అభిమానులకు జోష్ ను ఇచ్చే న్యూస్ గా మారింది. ఇక ఈ అవార్డుల వివరాలు  2012 సంవత్సరానికి గాను ఇలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం- ‘ఈగ’ రెండో ఉత్తమ చిత్రం- ‘మిణుగురులు’ మూడో ఉత్తమ చిత్రం- ‘మిథునం’ ఉత్తమ దర్శకుడు- ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈగ ఉత్తమ కథానాయకుడు- నాని ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఉత్తమ కథానాయిక- సమంత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఉత్తమ సహాయనటుడు- అజయ్‌ ‘ఇష్క్‌’ ఉత్తమ సహాయనటి- శ్యామల ‘వీరంగం’ బెస్ట్‌ పాపులర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌- ‘జులాయి’ ఉత్తమ గాయకుడు- శంకర్‌ మహాదేవన్‌ ఉత్తమ గాయని- గీతామాధురి ఉత్తమ సంగీత దర్శకులు- కీరవాణి ‘ఈగ’, ఇళయరాజా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. 

ఇక మరి  2013 సంవత్సరానికి సంబంధించి అవార్డుల వివరాలు ఉత్తమ చిత్రం- ‘మిర్చి’ రెండో ఉత్తమ చిత్రం- ‘నా బంగారు తల్లి’ మూడో ఉత్తమ చిత్రం- ‘ఉయ్యాల జంపాల’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- ‘అత్తారింటికి దారేది’ ఉత్తమ కుటుంబ కథా చిత్రం- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఉత్తమ కథానాయకుడు- ప్రభాస్‌ ‘మిర్చి’ ఉత్తమ కథానాయిక- అంజలి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఉత్తమ దర్శకుడు- దయా కొడవగంటి ఉత్తమ సహాయనటుడు- ప్రకాశ్‌రాజ్‌

చాల కాలం తరువాత తిరిగి నంది అవార్డులు ప్రకటన రావడం హర్షింప తగ్గ విషయమే అయినా ఈ లిస్టులో మన టాలీవుడ్ టాప్ హీరోలు చాలామంది లేకపోవడం ఒక విధంగా అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: