తెలుగు ప‌రిశ్ర‌మ‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని వాడుకొన్నంత‌గా మ‌రే హీరోనీ వాడుకోలేదేమో? ఏ సినిమా చూసినా ప‌వ‌న్‌ని పాజిటివ్ గానో, నెగిటీవ్ గానో చూపించి ఫ్రీగా ప‌బ్లిసిటీ పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ర‌వితేజ బ‌లుపు సినిమా కూడా అంతే. పోస్ట‌ర్ల‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ గెట‌ప్‌ల‌ను డాన్స్ ట్రూప్‌కు త‌గిలించారు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ కాస్త అలిగారు కూడా. సినిమాలో ప‌వ‌న్ గురించి కొన్ని పాజిటివ్ ముక్క‌లు చెప్పి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. అయితే బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా హ‌ర్ట‌య్యారు.

ఈ సినిమాలో ప‌వ‌న్‌తో పాటు బాల‌య్య‌నీ వాడేశారు. ఓ సీన్‌లో ర‌వితేజ బాల‌కృష్ణ‌లా స్పీచ్ ఇస్తాడు. అంటే... ఏమాత్రం అర్థం ప‌ర్థం లేని మాట‌లు, సెంటెన్స్ కంటిన్యుటీ లేకుండా, ఎక్క‌డో మొద‌లెట్టి, ఇంకెక్క‌డికో వెళ్లిపోయి.. అలా నోటికి ఏది వ‌స్తే అలా మాట్లాడేశాడు. విత్ బాల‌కృష్ణ మేన‌రిజాన్ని ఇమిటేట్ చేస్తూ..! మ‌రి దీనికి బాల‌య్య ఫ్యాన్స్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

��

ర‌వితేజ‌-బాల‌కృష్ణ మ‌ధ్య ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని,ర‌వితేజ‌ని బాల‌కృష్ణ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో ప‌రిశ్ర‌మ‌లో గాసిప్స్ వినిపించాయి. ఫ్లాష్ బ్యాక్ గుర్తుపెట్టుకొనే ర‌వితేజ రివైంజ్ ఈ రూపంలో తీర్చుకొన్నాడ‌ని సినీ జనాలు చెప్పుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: