అనుభ‌వం కంటే ప్ర‌తిభే గొప్ప‌ది అని న‌మ్ముతోంది పరిశ్ర‌మ‌.స‌త్తా ఉంటే కొత్తవారైనా స‌రే అవ‌కాశం ఇవ్వ‌డానికి టాప్ హీరోలు వెన‌క‌డుగు వేయ‌డం లేదు. మిర్చితో అంద‌రినీ ఆక‌ట్టుకొన్న కొర‌టాల శివ‌.. వెంట‌నే మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్టే అవ‌కాశం ద‌క్కించుకొన్నాడు. వీరి సినిమా ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఇప్పుడు కొర‌టాల శివ‌కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు కి ఓ క‌థ చెప్ప‌బోతున్నాడ‌ట‌.

మిర్చి త‌ర‌వాత చాలామంది పెద్ద హీరోల దృష్టి కొర‌టాల శివ‌పై ప‌డింది. చ‌ర‌ణ్ మాత్రం అంద‌రికంటే ముందే క‌ర్చీఫ్ వేశాడు. ఈ సినిమా చేతిలో ఉండ‌గానే మ‌హేష్‌తో చేసే ఛాన్స్ కొట్టేశాడు కొర‌టాల శివ‌. యూటీవీ సంస్థ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స్ అయ్యింది. అది మ‌హేష్‌తో చేయాల‌ని ఈ కొత్త ద‌ర్శ‌కుడు భావిస్తున్నాడ‌ట‌.

��

వ‌న్ షూటింగ్ కోసం ప్ర‌స్తుతం లండ‌న్‌లో ఉన్నాడు మ‌హేష్‌. అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర‌వాత కొర‌టాల శివ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతాడు. క‌థ న‌చ్చితే... వ‌చ్చే యేడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌, మ‌హేష్ వ‌రుస‌గా టాప్ హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశం రావ‌డం గ్రేటే క‌దా?

మరింత సమాచారం తెలుసుకోండి: