దిక్కులేని వాళ్ళకు దేముడే దిక్కు అయినట్లుగా టాలీవుడ్ లో ఫ్లాపు హీరోలకు పవన్ కళ్యాణ్ దిక్కుగా మారాడా అని అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ పేరును వాడుకోవడం సెంటిమెంట్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే  ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతమైన హీరో నితిన్ పవన్ కళ్యాణ్ జపం చేయడంతో పాటు, తన సినిమాలోనూ ఆయన పేరును, ఇమేజ్‌ను వాడుకుని ప్లాపుల సునామీలో కొట్టుకు పోకుండా ఒడ్డుకు చేరాడు.. ఆ తర్వాత పలువురు హీరోలు సెంటిమెంటుగా పవన్ కళ్యాన్ పేరును, గబ్బర్ సింగ్ సినిమాలోని సీన్లను, అంత్యాక్షరి పాటలను వాడుకున్నారు. తాజాగా మాస్ మహరాజ రవితేజ కూడా తన తాజా సినిమా ‘బలుపు'లో పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నాడు.

 ‘బలుపు' సినిమా హిట్ టాక్ రావడంతో హిట్ క్రెడిట్ కాస్త పవన్ కళ్యాణ్ కే ఆ క్రేడిట్ దక్కింది. నిజానికి  ఈ సినిమాలో  పవన్ కళ్యాణ్‌‌ పేరు అవసరం లేకున్నా సెంటిమెంటుగా మారి ఆయన పేరును వాడుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ సెంటిమెంటు బాగా వర్కౌట్ అవుతుండటంతో ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం గా మారింది.  త్వరలో రాబోయే మరిన్ని సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగే సన్నివేశాలతో సినిమాలు ఉంటాయని సమాచారం.

మరి ఈ ట్రెండు ఎంత కాలం కొనసాగుతుందో? మెగా కుటుంబానికి చెందిన పెద్ద హీరోలు రామ్ చరణ్ అల్లుఅర్జున్ ల ఆడియో వేడుకలు కూడా పవన్ లేకుండా జరుపుకోలేని స్థితి వచ్చేసింది అంటే పవన్ మేనియా నేడు టాలీవుడ్ లో ఎంత పవర్ ఫుల్ గా ఉందో అందరికీ అర్ధమౌతుంది. అందుకే పవన్ తాను ఎవరికీ పోటీ కానని తనకు తానే పోటీ అని అంటూ ఉంటాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: