మన హీరోయిన్స్ ఏం చేసినా కొంచెం అతిగానే చేస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ చేసిన దానిని మరొక హీరోయిన్ అనుకరిస్తూ తాము ప్రేమించిన వారిపై ప్రేమ ను చాటుకుంటూ ఉంటారు. ఇంతకీ విషయం ఏమిటి అనుకుంటున్నారా...? గతంలో నయనతార, దీపికా పదుకొనే, తాప్సి లు వేయి౦చుకున్నట్లుగా ఇప్పుడు క్యూట్ హీరోయిన్ సమంత కూడా తన అందమైన శరీరం పై తన ప్రేమకు గుర్తుగా ఒక టాటూ వేయి౦చుకుందట.

 ఒక ప్రైవేట్ కార్యక్రమానికి చిట్టిపొట్టి దుస్తులతో వచ్చిన సమంత ఒంటిపై టాటూ కనబడడంతో అందరి దృష్టి ఆ టాటూ పైకి వెళ్ళి ప్రశ్నిస్తే, మన సమంత మాత్రం అది ఒక లవ్ టాటూ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చిందట. ఈమధ్య యూరప్ కు షూటింగ్ నిమిత్తం సమంత వెళ్ళినప్పుడు అక్కడ ఈ అందమైన టాటూ వేయి౦చుకుందని టాక్. ఇంతవరకూ బాగానే ఉంది కాని గతంలో నయనతార కూడా తను ప్రేమిస్తున్న ప్రభుదేవా కోసం ఇలా తన శరీరం పై అందమైన టాటూలు వేయి౦చుకొని తరువాత తమ ప్రేమ బ్రేక్ అప్ అయిన తరువాత ఆ టాటూలు చేరిపించుకోవడాని నానాపాట్లు పడింది. అలాకాకుండా సమంత తన ప్రియుడు సిద్ధార్ద్ కోసం వేయి౦చుకున్న ఈ లవ్ టాటూ వీరిద్దరినీ పెళ్ళి పీటల వరకూ తీసుకువెళ్ళపోతే సమంత కు కూడా నయనతారకు పట్టిన కష్టాలే పడతాయి.

 పీకల లోతు ప్రేమలో ఎలాగూ సమంత మునిగిపోయింది కాబట్టి ఆ పెళ్ళి వ్యవహారం కూడా త్వరగా జరిపించేస్తే సమంత వేసుకున్న టాటూలకు అర్ధం పరమార్ధం చేకురతాయి. ఇంతకీ మన హీరో సిద్ధార్ద్ కూడా సమంత లాగే తన ప్రేమను వ్యక్తపరుస్తూ అతడి శరీరం పై కూడా లవ్ టాటూ వేయి౦చుకున్నాడో లేదో తెలియాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: