ఇటివలే మిర్చితో హిట్ కొట్టిన రిచా గంగోపాధ్యాయకి ఆ హిట్ లో 1 పెర్సెంట్ క్రెడిట్ కూడా దక్కలేదు. ఇప్పటి వరకు సోలో హీరోయినుగా, ఇద్దరి హీరోయిన్లలో నెంబర్ 1 హీరోయినుగా ఛాన్స్ రాని రిచా, ప్రజెంట్ భాయ్ లో నాగార్జున సరసన సోలో ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీకి వచ్చిన ఇంతకాలం తరువాత తనకి ఈ అవకాశం ఇచ్చిన హీరో నాగ్ పైన, దర్శకుడు వీరభద్రం పైన ఎనలేని ప్రేమ పొంగుకొస్తుందట.


ఇప్పటికే ఎందరో హీరోయిన్ల విషయంలో నాగ్ క్రీడా స్ఫూర్తి తెలిసిందే. కాబట్టి అతని గురించి ఎంత చెప్పిన పరమ రొటినే అవుతుంది. కానీ రిచా ఇంటరెస్ట్ చూస్తుంటే నాగ్ కంటే ముందు డైరెక్టర్ వీరభద్రంను అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే వీరభద్రం ఎక్కడుంటే అక్కడ రీచా ప్రత్యక్షమవుతుంది. ఆమెకి సోలో ఛాన్స్ ఇవ్వడం వల్ల రిచా ఇలా చేస్తుందని అనుకోవచ్చు.


కాని రీసెంటుగా జరిగిన రొమాన్స్ మూవీ ఆడియో వేడుకకి వీరిద్దరూ మొగుడు పెళ్ళాం లాగా రావడం ఫంక్షన్లోకి వచ్చిన ఎందరినో ఆశ్యర్యంకి గురిచేసింది. పక్కన అల్లు అర్జున్ అంతటి స్టార్ హీరో ఉన్నా కూడా అందరి కళ్ళు రిచా అండ్ వీరభద్రంల పైనే ఉన్నాయంటే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉండే ఉంటుందనే అనుమానం రాకుండా ఉంటుందా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: