ఒకోసారి మితిమీరిన పొగడ్తలు వెగటుగా అనిపించడమే కాకుండా అలా పోగిడించుకొనే వారిపై కూడా దురభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. అటువంటి సంఘటనే నిన్న భాగ్యనగరం లో జరిగింది. నిన్న అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చిన ‘రోమాన్స్’ సినిమా ఆడియో విడుదల వేడుకలో చాలామంది వక్తలు దర్శకుడు మారుతి ని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడారు. ఎవరైనా విజయాల బాటలో ఉన్నప్పుడు ఇలాంటి పొగడ్తలు చిత్ర పరిశ్రమలో సర్వసాధారణమే.

కాని నిన్న ఈ ఆడియో వేడుకలో పాల్గొన్న లేడీ డైరెక్టర్ జయ, దర్శకుడు మారుతి ని రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ ల కంటే గొప్పవాడని ఆకాశానికి ఎత్తేస్తూ దర్శకురాలు జయ మాట్లాడుతూ ఉంటే, ఆ ఆడియో వేడుకకు విచ్చేసిన వారంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం పసిగట్టిన మారుతి ఖంగారుపడి పోయి దర్శకురాలు జయ ను అంతంత పెద్ద మాటలతో తనను పోల్చవద్ధంటూ చెప్పి, ఆమె దగ్గరనుంచి మైకు ను సున్నితంగా తీసేసుకున్నాడు.

 ఈ సంఘటన చూసి ఆ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అతిధులతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు మూడు యువతరానికి నచ్చే మసాలా సినిమాలు తీసి విజయం సాధించిన మారుతి ని తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాలు సృష్టించుకున్న రాఘవేంద్రరావు, దాసరి, వర్మ లతో పోల్చడం జయ అజ్ఞానం అనుకోవాలా..? లేక అత్యుత్సాహం అనుకోవాలా..? ఆమె కే తెలియాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: