బెంగాలీలు తరువాత చేపలను మలయాళీలు బాగా తింటారు. కేరళలో చేపల కూరను అతిధులకు స్పెషల్ గా తయారు చేసి పెట్టడం ఆనవాయితి. మలయాళీ కుట్టి గా వచ్చి ఇప్పుడు దక్షిణ చలనచిత్ర పరిశ్రమను ఏలుతున్న నయనతార కు కూడా చేపల పులుసు వండడం అంటే మహామజా అట.

 చేతినిండా నయన్ కు సినిమాలు ఉన్నా, అప్పుడప్పుడు నయనతార తనకు ఇష్టమైన కేరళలోని తన ఊరికి వెళ్ళి తన సొంత వలతో చేపలు పట్టి వెరైటీ వెరైటీ రకరకాల కూరలు, పులుసులు తయారు చేసి తన చుట్టాలకు, తన శ్రేయోభిలాషులకు వండి పెట్టడం అంటే నయనతార కు చెప్పలేని ఆనందం అట. అందుకే ప్రతి వేసవి కాలంలోనూ ఏదోలా వీలు చేసుకొని తన సొంత ఊరిలో కనీసం ఒక్కరోజు అయినా చేపలు పడుతూ కాలం గడిపేస్తాను అని అంటోంది నయన్.

వలవేసి చేపలు పట్టడం లోనే కాదు తన ప్రేమతో రకరకాల ప్రేమికులను వల వేసి పట్టుకోవడం లోనూ కూడా నయనతారకు మంచి టాలెంట్ ఉంది. కొన్నాళ్ళ క్రితం శింబు, మొన్నటి దాకా ప్రభుదేవా, ప్రస్తుతం ఆర్య. ఇలా నయన్ వేసే వలల్లో ప్రేమ బందీలుగా పడ్డవారే. తన చిన్నప్పటి చేపల వేట అలవాటు ప్రస్తుతం నయనతారకు తన కెరియర్ లో కూడా బాగా ఉపయోగ పడుతుందని అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: