నాగార్జున లేటెస్ట్ మూవీ భాయ్ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూపులు చూసే ఫ్యాన్స్ కు నాగార్జున క్లారిటీ ఇవ్వబోతున్నాడు. నాగార్జున పుట్టిన‌రోజు ఆగ‌ష్టు 29న ఉండ‌టంతో అదే రోజున ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌టానికి ప్లానింగ్ జ‌రుగుతుంది. వీర‌బ‌ధ్రమ్ డైరెక్షన్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానులు హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెట్టుకున్నారు.

రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది.ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన 60 ప‌ర్సెంట్ షూటింగ్ పూర్తిచేసుకోవ‌డంతో ఆడియో వేడుక‌ను జులై అనుకుంటున్నా, ఇది ఆగ‌ష్టు వ‌ర‌కు వెళ్ళొచ్చని చెబుతున్నారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా నాగార్జునే స్వయంగా అన్నపూర్ణా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ మూవీను నిర్మిస్తున్నాడు.

సోను సూద్ ముఖ్యపాత్రగా న‌టాలియ కౌర్‌,హంస నందినిల‌పై ఐటెం సాంగ్‌ల‌ను ఆల్రెడీ షూట్ చేశారు. భాయ్ సినిమా ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించ‌టం ఖాయం అని నాగార్జున న‌మ్ముతున్నాడు. మొత్తానికి భాయ్ ఫ‌స్ట్‌లుక్ త్వర‌లోనే బ‌య‌ట‌కు రావ‌డ‌టానికి సిద్ధమౌతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: