సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా ఓ హీరోతో డేటింగ్ చేస్తుందంటే ఎవ‌రైనా న‌మ్ముతారా. కాని ఇది నిజంగా నిజ‌మే అని తెలుసుకున్న త‌రువాత ఎవ‌రైన సోనాక్షి అమాయ‌క‌త్వాన్ని అనుమానించ‌క త‌ప్పదు మ‌రి.

సోనాక్షి నటించిన లేటెస్ట్ మూవీ లూటెరా ప్రమోష‌న్‌తో, సీక్రెట్‌గా జ‌రుగుతున్న డేటింగ్ మేట‌ర్ బ‌హిర్గతం అయింది. ఈ మూవీ ప్రమోష‌న్‌లో ర‌ణ్‌వీర్ సింగ్, సోనాక్షి మీద ఎక్కడ‌ప‌డితే అక్కడ చేతులు వేస్తున్నాడు. బాలీవుడ్ మీడియాకు ఆ విధ‌మైన చేష్టలు అనుమానాన్ని క‌లిగించడంతో, ఇంకేముందు వీళ్లిద్దరి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో కూపీ లాగారు. ఇందులో న‌మ్మలేని నిజాలు మీడియాకు తెలిసాయంట‌.

ద‌బాంగ్ మూవీ షూటింగ్ స‌మ‌యం నుండి ర‌ణ్‌వీర్ సింగ్‌తో అప్పుడ‌ప్పుడు సోనాక్షి ట‌చ్‌లో ఉండేద‌ట‌. అంతేకాకుండా బాలీవుడ్ బ‌డా హీరోలు ఫంక్షన్లకు పిలిచినా ప‌ట్టించుకోని సోనాక్షి, ర‌ణ్‌వీర్ సింగ్ పిలిస్తే కార‌ణాలు అడ‌క్కుండా కారు ఎక్కేస్తుంద‌ట‌. ఆ మ‌ధ్య ఇద్దరూ ఓ రెస్టారెంట్‌కు వెళ్ళి, దాదాపు స‌గం రోజు ఫోన్ స్విఛ్చాఫ్ పెట్టుకున్నారు. ఇదే విష‌యం అంద‌రిలోనూ అనుమాన్ని రేకెత్తించింది. ఇద్దరి మధ్య న‌డిచేది ఖ‌చ్చిత‌మైన డేటంగ్ అని డిసైడ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: