మినిమం గ్యారెంటీ హీరోగా అటు నిర్మాత‌ల‌కూ, ఇటు ప్రేక్ష‌కుల‌కూ నవ్వులు పంచుతున్నాడు అల్ల‌రి న‌రేష్‌. తండ్రిలా ద‌ర్శ‌కుడు కావాల‌నుకొన్నా... ప‌రిస్థితులు అత‌న్ని అనుకోకుండా హీరోని చేశాయి. ఏ ముహూర్తంలో అల్ల‌రి సినిమాలో అడుగు పెట్టాడో గానీ, అప్ప‌టి నుంచీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఆదివారం ఆ అల్ల‌రోడి పుట్టిన రోజు.

''ఈత‌రం ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఎందుకంటే.. ఎస్మెమ్మెస్సుల పుణ్యాన జోకుల‌న్నీ విరివిగా అందుబాటులోకి వ‌చ్చాయి. కొత్త‌గా న‌వ్వించ‌డం ఎప్పుడూ ఓ స‌వాలే!  విభిన్న‌మైన క‌థ‌లు, పాత్ర‌లు ఎంచుకొన్న‌ప్పుడే అది సాధ్యం అవుతుంది'' అని చెబుతున్నాడు న‌రేష్‌. కెవ్వుకేక విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మ‌రోవైపు ల‌డ్డూబాబు త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

��

ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రం ల‌డ్డూ బాబు. ఈ సినిమాలో న‌రేష్ పాత్ర చిత్రీక‌రణ కాస్త కొత్త‌గా ఉండ‌బోతోంది. న‌రేష్ కోసం లండ‌న్ నుంచి మేక‌ప్‌మేన్‌ని తీసుకొస్తున్నారు. న‌రేష్ ఖాతాలో ఇది 46వ సినిమా. త్వ‌ర‌లోనే అర్థ‌సెంచ‌రీ పూర్తి చేసుకోవాల‌ని, ఇంకా మ‌న‌ల్ని ఇలానే న‌వ్విస్తుండాల‌ని ఏపీ హెరాల్డ్ మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: