దెయ్యం సినిమాల‌కూ, గ్రాఫిక్స్ గాథ‌ల‌కూ తెలుగులో ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. నైపుణ్య‌వంతులైన సాంకేతిక నిపుణులు ప‌నిచేయాలే గానీ - మంచి సినిమాలే తీయొచ్చు. ప్రేక్ష‌కులు కూడా ఇలాంటి సినిమాలు తీయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ కూడా దెయ్యం క‌థే. ఆ సినిమాకి డ‌బ్బులు బాగా వ‌చ్చాయి. మోక్ష‌లో కూడా ఆత్మ‌గోల క‌నిపించింది. ఇప్పుడు మ‌రో సినిమా సిద్ధం అవుతోంది అదే స‌హ‌స్ర‌.

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ త‌ర‌హా క‌థ‌ల్లో రాణించే న‌టుడు రాజీవ్ క‌నకాల‌. విశాఖ ఎక్స్‌ప్రెస్ త‌ర‌వాత... మ‌రో సినిమా చేయ‌లేదు. చేసినా చిన్నా చిత‌కా పాత్ర‌లే. ఈసారి మాత్రం పూర్తి స్థాయి సినిమా చేశాడు. అదే స‌హ‌స్ర‌. ఇది కూడా దెయ్యం సినిమానేన‌ట‌. అరుంధ‌తి, కాంచ‌న రేంజులో ఈ సినిమా ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

��

ఇలాంటి క‌థ‌లకు విజువ‌ల్ ఎఫెక్ట్ చాలా కీల‌కం. ఆ విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకొన్నార‌ట‌. స‌హ‌స్ర టైల‌ర్లు చూసిన వాళ్లంతా ఝ‌డుసుకొంటున్నార‌ట‌. మ‌రి సినిమా ఏ రేంజులో ఉంటుందో మ‌రి?

మరింత సమాచారం తెలుసుకోండి: