ఉత్త‌రాఖండ్‌లో మ‌హా ప్ర‌ళ‌యం సంభ‌వించింది. ఎన్నో కుటుంబాలు చల్లాచెదురైపోయాయి. ఎంత‌మంది ప్రాణాలు కోల్పోయారో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ అంచ‌నాకు రాలేక‌పోతున్నారు. మ‌ళ్లీ ఆ పుణ్య‌భూమి క‌ళ‌క‌ళ‌లాడాలంటే ఎన్నేళ్లు ప‌డుతుందో??  ప్ర‌తి భార‌తీయుడూ స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చి ఆదుకోవాల్సిన త‌రుణ‌మిది. మ‌రి మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ మాత్రం మిన్న‌కుండిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క‌రూ ముందుకొచ్చి.. మేమేన్నాం అనే అభ‌య హ‌స్తం మాత్రం అందించ‌లేక‌పోతున్నారు.

ప‌వ‌న్‌, మ‌హేష్ ఆర్థిక స‌హాయం చేశార‌ని చెబుతున్నా - అధికారికంగా తెలీలేదు. వాళ్లిచ్చారు స‌రే, మరి మిగ‌తావాళ్ల మాటేమిటి?  మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌)కి డ‌బ్బులుకావాలంటే మాత్రం క్రికెట్లూ, సాంస్ర్క‌తిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి డ‌బ్బులు పోగేసుకొంటారు. సాటి మ‌నిషికి సాయం చేయాలంటే మాత్రం ముందుకు రారా?  మ‌నోళ్లు మ‌రీ ఇంత స్వార్థ ప‌రులా??

��

ఆడియో వేడుక‌ల‌కు ల‌క్ష‌లు ధార‌బోస్తారు. సాటివాడి క‌డుపు నింప‌డానికి ముందుకు రారా?? మ‌నోళ్లు మ‌రీ ఇంత పిసినారులా??  మా ఇంత వ‌ర‌కూ ఈ విష‌యంలో ఓ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేక‌పోయంది. అంటే తెలుగువారిని బాధ క‌లిగితేనే స్పందిస్తారా??  భార‌తీయులుగా మ‌న బాధ్య‌త లేద‌నుకొంటున్నారా??  ఇప్ప‌టికైకా మించిపోయింది లేదు. ఉత్త‌రాఖండ్ బాధితులకు ఇతోదికంగా స‌హాయం చేయడానికి మా.. ముందుకు రావాలి. మ‌న‌మంతా ఒక్క‌టే అనే సంకేతాలు పంపాలి. అందుకోసం హీరోలు, హీరోయిన్లు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: