సినిమా అంటే ఎవ్వరికైనా పిచ్చి ఉంటుంది..అందునా వెండితెరపై తమను తాము చూసుకోవాలని కోరిక లేని మనిషి ఉండరు.  అయితే కొంత మంది ఆ కోరికను బాగా క్యాష్ చేసుకుంటారు.  ముఖ్యంగా అమ్మాయిలను తమ లైంగిక వాంఛలు తీర్చితే సినిమా చాన్స్ లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసే బ్రోకర్లు, బడా బాబులు చాలా మంది ఉంటారు.  ఇలా సినిమాలపై మోజుతో స్టూడియో చుట్టూ తిరుగుతూ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకునే అమ్మాయిలను తమ బలహీనతను కొంత మంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటారు..తమ కోరిక తీరిన తర్వాత వారిని పడుపు వృత్తిలోకి నెట్టేస్తారు.

 ఇక అందమైన అమ్మాయి కనిపిస్తే కొంత మంది బడాబాబులు వారిపై కన్నేసి తమ కోరిక తీర్చితే సినిమా చాన్స్ ఇప్పిస్తామని చెబుతూ ఉంటారు..అలా చెప్పి ఓ అమ్మాయిని మోసం చేయాలనుకున్న ఓ నిర్మాతను ఆ అమ్మాయి బంధువులు వచ్చి పిచ్చి కొట్టుడు కొట్టిన సంఘటన కర్ణాటకలో జరిగింది.   'ప్రీతి మాయ హుషారు '' అనే చిత్రాన్ని వీరేష్ నిర్మిస్తున్నారు .

అయితే తన సంస్థ లో పనిచేసే అందమైన అమ్మాయి పై అతడి చూపు పడింది అంతే నిన్ను హీరోయిన్ ని చేస్తాను అంతేకాదు నాకు తెలిసిన అగ్ర నిర్మాతల కు కూడా చెప్పి వాళ్ళ సినిమాల్లో కూడా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాను అయితే ముందుగా నాకు పడక సుఖం అందిస్తే కానీ ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ పదేపదే పోరు పెడుతూండటం తో చేసేది లేక ఇంట్లో చెప్పింది . విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి బంధువులు సదరు నిర్మాతను మర్యాదగా పిలిచి బండ బూతులు తిడుతూ వీర లెవెల్లో కోటింగ్ ఇచ్చి..తర్వాత బెంగుళూర్ లోని హెచ్ ఎస్  ఆర్ లే ఔట్ పోలీస్ స్టేషన్ లో అతడ్ని అప్పగించారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: