జ‌స్టిన్ బీబ‌ర్...ఈ పేరు తెలియ‌ని పాప్ ప్రియులుండ‌రంటే ఎంత మాత్రం అతిశ‌యోక్తి కాదు. నిజానికి  అత‌డు స్టేజి ఎక్కి గొంతు విప్పితే  వ్యూయ‌ర్స్ ఊగిపోతుంటారు.   అమ్మాయిలు క‌ల‌వ‌రింత‌లు మొద‌లెడుతుంటారు. అంత‌గా మ్యాజిక్ చేసే ఈ రాక్  స్టార్  ఏజ్  ఎంతంటే నిండా ఇర‌వై ఏళ్లే.  ఆ విష‌యం ప‌క్కన‌పెడితే ఇపుడు ఈ బుల్లోడు పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్రేమ వ‌ర‌కు ఓకే గానీ 20 ఏళ్లకే పెళ్లిపై మోజు ఎంటి అని మీ డౌటు కదా..? దానికి ఓ రీజ‌న్ వుంది . అదేంటంటే...

ఈ రాక్ స్టార్ గ్రాండ్ పేరెంట్స్ బ్రూసీ అండ్ డానీ డామెల ఇర‌వై ఏళ్ల వ‌య‌స్సులో  ప్రేమించి పెళ్లి చేసుకున్నార‌ట‌. ఇప్పటికీ వారి అన్యోన్యత‌ను చూస్తే మ‌నోడికి ఆశ్చర్యం వేస్తుంద‌ట‌. ఆ ఆశ్చర్యంలోంచే ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని, అది కూడా ఇప్పుడే చేసుకోవాల‌నే ఆలోచ‌న పుట్టింద‌ట‌.
��
మ‌రి ప్రపంచంలోనే టాప్ పాప్ సింగ‌ర్ అయిన బీబర్ పెళ్లి చేసుకుంటాను అంటే ఏ అమ్మాయి కాదంటుంది చెప్పండి. బిల్ గేట్స్ కూతురైనా ఓ.. య‌స్ అనాల్సిందే. మ‌రి  పెళ్ళి చేసుకోవాల‌నిపిస్తుంది అని ప్రక‌టించిన  జ‌స్టీన్ బీబ‌ర్ త‌న‌కు ఎలాంటి అమ్మాయి కావాలో  కూడా ఎనౌన్స్ చేస్తే  స‌రిపోతుంది అంటున్నారు కొద్దిమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: