గ్లామ‌ర్ ఓరియెంటెడ్ రోల్స్ చేసే హీరోయిన్స్ స‌డ‌న్ గా క‌త్తి పాటు యుద్దం చేయాలంటే ఎలా వుంటుంది...?సాప్ట్ వేర్ అమ్మాయిని హార్డ్ వేర్ ప‌నిచేయ‌మ‌ని చెప్పిన‌ట్టుంటుంది.. ఇపుడు అదే ఫ్లాబ్లమ్ ఫేస్ చేస్తోంది క్యూట్ గ‌ర్ల్ శ్రీయ‌.

ఒక‌ప్పుడు టాప్ హీరోలంద‌రితోనూ న‌టించి నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్న ఈ సుంద‌రికి ప్రస్తుతం పెద్దగా ఛాన్స్ లేవీ లేవు. కానీ వున్న ఒక‌టి అర సినిమాల కోసం శ్రీయ విప‌రీతంగా క‌ష్టపడుతోంది. ప్రజెంట్ క‌న్నడంలో రాజుల నాటి కాలం నాటి క‌ధ‌తో తెరకెక్కుతున్న చంద్రలో రాజ‌కుమారి గా న‌టిస్తోంది. రాజ‌కుమారి క్యారక్టర్ అంటే ఇక చెప్పేదేముంది కత్తి సాము, గుర్రపు స్వారి లాంటి నేర్చుకోవాల్సిందేక‌దా..?

సేమ్ వే శ్రీయ ఈ సినిమా కోసం క‌ల‌రియ‌ట్టులో శిక్షణ తీసుకుంద‌ట‌. ఈ మ‌ద్యే కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఫైట్స్ లో వాడిన క‌త్తి, ఒంటిపై వేసిన కాస్టూమ్స్ బ‌రువు వుండ‌టంతో శ్రీయకు చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ట‌. ఫైటింగ్ సీన్ లో క‌త్తి తిప్పుతున్నప్పుడు వేళ్లు విపరీతంగా నొప్పి లేశాయ‌ట‌. అయిన‌ను ఫైట్ చేసింద‌ట‌. దీంతో శ్రీయ చేతివేళ్లు వాసి నొప్పి నొప్పి అంటోంది. అయితే సీన్స్ మాత్రం బాగా వ‌చ్చాయంటూ ట్వీట్ చేసిందీ ఈ సుందరి.

మరింత సమాచారం తెలుసుకోండి: