హెడ్ లైన్ , ప‌క్కన స్టిల్ చూసి షాక్ అయ్యారా....? అయ్యే వుంటారులెండి. స‌డ‌న్ గా ప‌వ‌ర్ స్టార్ జేమ్స్ బాండ్ గా ఏ సినిమాలో న‌టిస్తాడ‌బ్బా అని డౌట్ కూడా వ‌చ్చి వుంటుంది. అస‌లు విష‌యం ఏంటంటే ఈ స్టిల్ వ‌ర్జిన‌ల్ కాదు ప‌వ‌న్ వీరాభిమాని క్రియేట్ చేసింది. 

అచ్చం జేమ్స్ బాండ్ గెట‌ప్ లో ప‌వ‌న్, ప‌క్కన కారు,అదే స్టైల్లో బ్యాక్ గ్రౌండ్ సూప‌ర్ క‌దా.? అందుకే సోష‌ల్ నెట్ వ‌ర్క్ సైట్స్ లో ఈ ఫోటో ఓ రేంజ్ లో దుమ్మురేపుతోంది. అంతేకాదు ఓ గాసిప్ ని కూడా క్రియేట్ చేసింది. అదేంటంటే అత్తారింటికీ దారేదీ సినిమాలో స‌మంత‌కు జేమ్స్ బాండ్ అంటే అభిమానమ‌ట‌.ఆమె సంతోషం కోసం ఒక‌సారి జేమ్స్ బాండ్ గెట‌ప్ లో ప‌వ‌ర్ స్టార్ మెరుస్తాడ‌ని టాక్. మ‌రి అందులో నిజ‌మెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: