టాప్ హీరోల మేన‌రిజాన్ని భ‌లేగా ప‌ట్టేస్తారు అల్లరి న‌రేష్‌. సూప‌ర్ హిట్ సినిమాల్లో డైలాగుల్ని పేర‌డీలుగా ప‌లికి... న‌వ్విస్తుంటాడు. సుడిగాడు అయితే.. వంద సినిమాల‌ను స్ఫూఫ్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోలందరికీ కాపీ కొట్టాడు. ఈసారి ప్ర‌భాస్ మీద ప‌డ్డాడు. కెవ్వు కేక‌లో ప్ర‌భాస్ డైలాగుల్ని త‌న‌దైన స్టైల్లో వ‌ల్లిస్తున్నాడు అల్ల‌రోడు.

న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం కెవ్వు కేక‌. ఈ సినిమా కోసం మిర్చిలోని ప్ర‌భాస్ ప‌లికిన డైలాగులు ఈ సినిమాలో న‌రేష్ నోటి నుంచి వినొచ్చు. ''కొన్నిక‌టౌట్లు చూసి న‌మ్మేయాలి డ్యూడ్‌...'' అనేది మిర్చిలో ప్ర‌భాస్ పాపుల‌ర్ డైలాగ్‌. డైలాగ్ న‌రేష్ చెబితే ఎలా ఉంటుంది. మిర్చిలో ప్ర‌భాస్ ఈ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ చెప్పి కారుని కాలితో.. చిదిమేస్తాడు. ఆ ప‌వ‌ర్‌కి కారు చ‌క్రం కూడా దొర్లుకొంటూ వెళ్లిపోతుంది.

��

ఇందులో న‌రేష్ క‌దా..? అందుకే స‌ర‌దాగా బ‌డ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని గోడ గ‌డియారాన్ని ప‌గ‌ల‌గొట్టారు. కెవ్వుకేట ట్రైల‌ర్‌లో మిర్చి డైలాగే హైలెట్‌గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ స్ఫూఫ్‌ల‌నే న‌మ్ముకొన్న న‌రేష్ ఈసారీ అదే దారిలో వెళ్లాడు. వ‌రుస పరాజయాల‌కు ఈ సినిమా అయినా పుల్‌స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: