కాకతీయ పౌరుషానికి చిరునామాగా నిలిచే పాత్ర వీరనారి రాణి రుద్రమ. ఆమె కధకు తెలుగు రూపాన్ని ఇస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చారిత్రాత్మిక చిత్రం ‘రుద్రమ దేవి’. రుద్రమ దేవి గా అనుష్క నటిస్తున్న ఈ చిత్రం అప్పుడే 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. 3డి లో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన 1000 స్థంబాల సెట్ లో ఈ సినిమా రెండవ షెడ్యుల్ త్వరలో ప్రారంభంకాబోతోంది.

తొలి షెడ్యుల్ లో రాణి రుద్రమ గా నటించిన అనుష్క కు 5 కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన నిజమైన బంగారు ఆభరణాలు తయారు చేయి౦చి, ధరింపచేయి౦చారట. బాలీవుడ్ లో విజయవంతం అయిన ‘జోదా అక్బర్’ సినిమాకు ఆభరణాల డిజైనర్ గా పనిచేసిన నితాలుల్లా చే ఈ కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయి౦చినట్లు ఈ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ చెపుతున్నారు. ఈనెల 3వ తారిఖు నుండి ప్రారంభం అయ్యే రెండవ షెడ్యుల్ లో 1000స్థంభాల గుడి సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రికరిస్తానని గుణ శేఖర్ చెపుతున్నాడు. హరిహర దేవరాయ పాత్రలో సుమన్, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, రానా, నథాలియా కౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ‘రుద్రమ దేవి’ షూటింగ్ డిసెంబర్ కి పూర్తి చేసి, వచ్చే సంవత్సరం ప్రధమార్ధం లో విడుదల చేస్తానని గుణ శేఖర్ అంటున్నారు.

ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు ఉంటాడా..? ఉండడా..? అనేది మరికొద్ది రోజులలో తేలిపోతుంది. జోదా అక్బర్ ఐశ్వర్య రాయ్ కి ఆమె ధరించిన ఆభరణాలకి ఎంత పేరు తీసుకువచ్చిందో, మన బొమ్మాలి కి కూడా ఈ సినిమా అంత పేరు తీసుకువస్తుందని అనుకోవాలి. ఇక త్వరలోనే చాలా చోట్ల అనుష్క ధరించిన రుద్రమ దేవి ఆభరణాలు ఫాన్సీ డిజైన్స్ గా మారి మార్కెట్ లో మహిళల హృదయాలను దోచుకుంటాయని అనుకోవాలి. వెండితెరపై ఆభరణాలతో మెరిసిపోయే అనుష్కను చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: