మ‌న టాలీవుడ్ లో ఈ మ‌ద్య ఏ సినిమా ఎనౌన్స్ చేసిన డేట్ రిలీజ్ అవ్వడం లేదు. వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఫ్యాన్స్ ని వ‌ర్రీకి గురి చేస్తున్నాయి. ఆ లిస్ట్ లో గోపిచంద్ న‌టించిన సాహసం కూడా ఒక‌టి. ఒక్కడున్నాడు త‌రువాత చంద్రశేఖ‌ర్ యేలేటి , గోపిచంద్ కాంబినేష‌న్ లో రూపొందిన సాహ‌సంపై భారీ అంచ‌నాలే వున్నాయి. గోపిచంద్ కి జోడిగా క్యూట్ గ‌ర్ల్ తాప్సి న‌టించిన ఈ సినిమా ట్రైల‌ర్స్, సాంగ్స్ ఇటీవ‌లే రిలీజై గుడ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

త‌నకి ఎలాంటి ఆస్తి పాస్తులు లేవ‌ని భావించే ఓ సాదార‌ణ సెక్యూరిటీ గార్డ్ కి, కోట్ల ఆస్తి వుంద‌న్న సంగ‌తి తెలిసి ఓ ప్రదేశానికి వెళితే అక్కడ ఏం జ‌రిగింద‌న్నే ఈ సినిమా క‌ధ‌ని మూవీ యూనిట్ అంటోంది. నిజానికి లాస్ట్ మ‌న్త్ 15న విడుద‌ల అవ్వాల్సిన సాహ‌సం రెండు సార్లు వాయిదా ప‌డింది. అయితే ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నట్టు ప్రొడ్యుస‌ర్ బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రక‌టించి రిలీజ్ పై ఓ క్లారిటీ ఇచ్చారు.మ‌రి ప్లాప్స్ తో అల్లాడిపోతున్న గోపిచంద్ కి సాహసం ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: