మైండ్‌లో ఫిక్స‌యితే బ్లైండ్‌గా దూసుకుపోతా... అని బాక్సాఫీసు ద‌గ్గ‌ర త‌న దూకుడు ప్ర‌ద‌ర్శంచాడు మ‌హేష్‌బాబు. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, కోన వెంక్ ర‌చ‌నా నైపుణ్యం, బ్ర‌హ్మానందం, ఎమ్మెస్ కామెడీ ఈ సినిమాకి తిరుగులేని విజ‌యం క‌ట్టబెట్టాయి. మ‌హేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిపాయి. ఇప్పుడు మ‌హేష్‌-శ్రీ‌నువైట్ల మ‌రోసారి జ‌త కట్టారు... ఆగ‌డు కోసం. ఈ సినిమా క్యాప్ష‌న్ ఏమిటో తెలుసా..?  దూకుడే దూకుడు.


ఈ సినిమా దాదాపుగా దూకుడు త‌ర‌హాలోనే ఉంటుంద‌ట. దూకుడులో ఏమైతే బ‌ల‌మైన ఎలిమెంట్స్ ఉన్నాయో అవ‌న్నీ  ఈ సినిమాలోనూ క‌నిపిస్తాయ‌ట‌. నిజానికి దూకుడు తీస్తున్న‌ప్పుడే శ్రీ‌నువైట్ల‌కు ఆగ‌డు ఆలోచ‌న వ‌చ్చింది. దూకుడు విడుద‌లైన వెంట‌నే ఆగ‌డు సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని భావించార‌ట‌. అయితే మ‌హేష్ క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల‌...ఈ సినిమా ఆల‌స్య‌మైంది.

��

ఈగ‌డు దూకుడికి సీక్వెల్ అని చెప్పుకొంటున్న‌వాళ్లు ఎన్నారు. క్యాప్ష‌న్ కూడా ఆ మాట‌కు బ‌లం చేకూర్చుతోంది. సీక్వెల్ అయినా కాక‌పోయినా దూకుడు త‌ర‌హాలో భారీ విజ‌యం సాధించాల‌ని ప్రిన్స్ అభిమానులు కోరుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: