తెరపై అందాలు ఆరబోయడంలో ఎవరు గొప్పా..? శ్రుతి హాసన్..? హన్సికా..? అంటూ ఎవరైనా ఒపినియన్ పోల్ పెడితే ఎక్కువ శాతం ఓట్లు హన్సిక కే పడతాయి. ఎందుకంటే శ్రుతి నిన్న గాక మొన్న వచ్చిన చిన్న కూన. అదే హన్సిక అయితే కోలీవుడ్ ను దున్నేసిన ‘దేశముదురు’. సిద్ధార్ద్ నటించిన ‘సమ్ థింగ్ సమ్ థింగ్’ సినిమా కోలీవుడ్ లో హిట్ అవడానికి హన్సిక అందాలే కారణం అంటారు. ఇక మొన్న శుక్రువారం విడుదల అయిన ‘బలుపు’ సినిమాలోని శ్రుతి హాసన్ హాట్ లుక్స్ జనానికి బాగా నచ్చడంతో రవితేజ కు శ్రుతి రూపంలో హిట్ దొరికింది అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం శ్రుతి హాసన్ అందాల కోసమే ఈ సినిమాకు మళ్ళి మళ్ళి యూత్ వస్తున్నారట.

ఈ విషయాన్ని పసిగట్టిన టాలీవుడ్ లోని ఒక యంగ్ హీరో తాను ప్రస్తుతం హన్సిక తో నటిస్తున్న సినిమాలో కూడా హన్సికను అలాగే రెచ్చిపోమని సలహా ఇస్తున్నాడట. హన్సిక అందాలతో ఆ హీరో మరో హిట్ కొట్టేయడానికి మాస్టర్ ప్లాన్ కూడా వేసుకుంటున్నాడట. అంతే ఈ బబ్లీ గర్ల్ కూడా దానికి రెడీ అనడమే కాకుండా తన శక్తి మేరకు తన ప్రయత్నం చేయడానికి రెడీ అయిపోతోందని టాక్. అయినా ఏడు సముద్రాలు ఈదిన చేప పిల్లకు కొత్తగా ఈత నేర్పేది ఏమిటి..? అంటూ ఫిల్మ్ నగర్ లో జోక్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ హన్సిక గ్లామర్ ఆ కుర్ర హీరోకు మరోసారి కలిసి వస్తుందో లేదో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: