తాజాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ మూవీ థియోట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. మొదటగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు, తమిళ్, మలయాళం ట్రైలర్స్ ని రిలీజ్ చేసిన తరువాత కాసేపటికి హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని పూర్తి చేసుకొని హిందీ ట్రైలర్ లాంచ్ కోసం ముంబాయ్ చేరుకున్నారు బాహుబలి టీం.

అయితే గతంలో బాలీవుడ్ లో బాహుబలి ప్రమోషన్స్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం ని ఎదుర్కొన్న ఈ టీం…ఈసారి బాగానే పికప్ అయిందని చెప్పవచ్చు. రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నలకి కాస్త దూకుడుగానే దర్శకుడు రాజమౌళి సమాధానం చెప్పారు. హందీలో ‘బాహుబలి – ది కంక్లూజన్’ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. ‘బాహుబలి– ది కంక్లూజన్’ మూవీని హిందీలో కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ పై రిలీజ్ చేస్తున్నారు.

ఇక కరణ్ జోహార్ సైతం ‘బాహుబలి–ది కంక్లూజన్’ మూవీ ఇండియాలోనే టాప్ అన్నట్టుగా బాలీవుడ్‌ హీరోలకి చరకలు అంటించాడు. అయితే కెమెరా ముందు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పిన రాజమౌళి…ఆఫ్ ది రికార్డ్ సమయంలో ఓ హిందీ మ్యాగజైన్‌ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చాడంట.

షారుఖ్ రాయిస్ రికార్డ్ ని‘బాహుబలి – ది కంక్లూజన్’ ట్రైలర్ బ్రేక్ చేసింది. ఫీలింగ్ ఎలా ఉంది? అనేది రిపోర్టర్ క్వశ్ఛన్. “ఇది ముందే తెలుసు. తెలుగు సినిమాకి ఆ సత్తా ఉంది. ప్యూచర్ ఇండస్ట్రీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ” అంటూ కామెంట్ చేయటంతో రిపోర్టర్ తో పాటు అక్కడ ఉన్నవారూ కూడ షాక్ అయ్యారంట. మొత్తంగా రాజమౌళి బాలీవుడ్ ఈవెంట్ కి అడుగుపెట్టడటంతో కాంట్రవర్సీ కామెంట్స్ చేయటం బాగానే నేర్చుకున్నాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: