బాహుబలి బిగినింగ్ తో సంచలనం సృష్టించిన రాజమౌళి సెకండ్ పార్ట్ తో ఇంకా మరిన్ని రికార్డులకు రెడీ అవుతున్నాడు. సినిమా ట్రైలర్ తో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన ఈ మూవీలో సుబ్బరాజు పాత్ర స్పెషల్ అప్పియరెన్స్ గా ఉండబోతుందట. సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సుబ్బరాజు సినిమాను టర్న్ తీసుకునేలా చేస్తాడట.


మొదటి పార్ట్ తో పాత్రల పరిచయాలు చేసిన జక్కన్న ఈ సెకండ్ పార్ట్ తో అసలు కథ నడిపిస్తాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. బాహుబలి లాంటి క్రేజీ మూవీలో చిన్న పాత్ర వచ్చినా చేయాలని ఆలోచనలో ఉన్న ఎంతోమందికి సుబ్బారాజు పాత్ర చూసి సర్ ప్రైజ్ అవడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు చిన్న పాత్రే అయినా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందట.


బాహుబలి బిగినింగ్ లో కాలకేయుడిగా ప్రభాకర్ కు ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో ఈ పార్ట్ లో సుబ్బరాజు అలా కనిపిస్తాడట. విలన్ అవకాశాలు కూడా సరిగా అందుకోలేని సుబ్బరాజు ఇప్పుడు సినిమాల్లో కనిపించట్లేదు. బాహుబలి-2 ట్రైలర్ రిలీజ్ సమయంలో సుబ్బారాజు వచ్చాడు కాబట్టి ఈ పార్ట్ 2లో సుబ్బరాజు పాత్ర కచ్చితంగా అందరిని ఆకట్టుకునేదిగా ఉంటుందని అంటున్నారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: