బాలీవుడ్ బుల్లితెరపై కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు కపిల్ శర్మ.  బాలీవుడ్ లో సెలబ్రెటీస్ అందరూ మనోడి ప్రోగ్రామ్ లో తెగ హంగామా చేస్తూ ఉంటారు.  అంతే కాదు తాము నటించిన కొత్త సినిమాల ప్రోమోషన్ వర్క్ కూడా ఈ ప్రోగ్రామ్ తో చేస్తూ ఉంటారు.  అలా భారత దేశంలోనే మంచి కామెడీ ప్రోగ్రామ్ గా కామెడీ నైట్స్ విత్ కపిల్ సాగిపోతుంది. అయితే కపిల్ శర్మ అప్పుడప్పుడు కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.  
Kapil Sharma
ఆ మద్య ఓ హీరోయిన్ తనను కపిల్ శర్మ ఎక్కడెక్కడో తాకాడని సోషల్ మీడియాలో తెగ హంగామా చేసింది..అంతే కాదు మనోడు అప్పుడప్పుడు తన నోటికి కూడా పని చెబుతుంటాడు..దీంతో కొన్ని సార్లు విమర్శల పాలు కూడా అయ్యాడు.  తాజాగా కపిల్ శర్మ తన సహనటుడు సునీల్ గ్రోవర్ ని చితకబాదాడట.  ఈ మద్య   మెల్ బోర్న్ , సిడ్ని లలో పలు ఈవెంట్ లకు హాజరై తిరిగి ఇండియాకు వస్తున్న సమయంలో తన సహ నటుడు అయిన సునీల్ గ్రోవర్ ని ఇష్టం వచ్చినట్లు కొట్టాడట..కానీ సులీన్ గ్రోవర్ మాత్రం ఒక్క సారి కూడా ఆయనకు ఎదురు తిరగలేదట.  
Image result for comedy with kapil
ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. సునీల్ తో గొడవ పెట్టుకొని కపిల్ శర్మ కొట్టడం మొదలు పెట్టిన తర్వాత ప్రయాణికులు ఎంత వారించినా వినలేదట..కాసేటి తర్వాత  ప్రయాణీకులు కపిల్ ని దూరంగా తీసుకెళ్ళి శాంతింపజేసారట .  ఇక కపిల్ శర్మ దగ్గర సునీల్ గ్రోవర్ పని చేస్తుండేవాడు అయితే తగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో కపిల్ దగ్గర మానేసి మరొక శో చేసాడు.  
Image result for comedy with kapil
కానీ మనోడికి ఆ ప్రోగ్రామ్ అచ్చిరాలేదు..దాంతో మళ్ళీ కపిల్ శర్మ దగ్గరకు వచ్చాడు . అయితే మెల్ బోర్న్ , సిడ్నీ లలో షోలను పూర్తిచేసుకొని వస్తున్న సమయంలో కపిల్ ఫుల్లుగా మద్యం తాగి సునీల్ ని చితక బాదాడు.  ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: