టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొద్ది రోజుల్లోనే థియోటర్స్ వద్ద హంగామా చేయనున్న మూవీ క్రేజీ మూవీ‘కాటమరాయుడు’. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన హంగామా థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. ఈ మూవీకి వస్తున్నరెస్పాన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ మూవీని మొదటి రోజే చూడటానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ‘కాటమరాయుడు’ ట్రైలర్ బయటకు రావటంతో ఈ క్రేజ్ మరింతగా పెరిగింది.


ట్రైలర్ లో ఎటువంటి ఓవర్ యాక్షన్ లేకపోవటంతో….అందులోనూ పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉండటంతో‘కాటమరాయుడు’ మూవీపై ప్రత్యేక అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ‘కాటమరాయుడు’ మూవీకి సంబంధించిన బిజినెస్ దాదాపు క్లోజ్ అయినట్టే అని అంటున్నారు. ప్రతి ఏరియాకి సంబంధించిన బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపిస్తున్న లెక్కల ప్రకారం ఈ మూవీకి దాదాపు 30 కోట్ల రూపాయల లాభాలు రిలీజ్ కి ముందే వచ్చాయని అంటున్నారు.


ఈసారి ‘కాటమరాయుడు’ బిజినెస్ అంతా నాన్ రిఫండబుల్ పద్దతిలో జరిగిందని అంటున్నారు. అయినప్పటికీ…ఈ రేంజ్ లో నిర్మాతకి ప్రాఫిట్స్ వచ్చాయంటే సినిమాకి జరిగిన బిజినెస్ అంతా ఫ్యాన్సీ నెంబర్సే అని అంటున్నారు. ఇక ‘కాటమరాయుడు’ మూవీ మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి ‘కాటమరాయుడు’ హావా ఎక్కువుగా కనిపిస్తంది. 


చెన్నైలో 24వ తేదీన నగరంలోని పలు ప్రధాన మల్టీ ప్లెక్సుల్లో పెద్ద సంఖ్యలో షోలను ప్రదర్శిస్తున్నారు. మాయాజాల్ మల్టీ ప్లెక్సులోనే 51 షోలు ప్రదర్శించనున్నారట. ఈ చిత్రం తమిళనాడు హక్కులు 90 లక్షల రూపాయల రికార్డ్ ధరకు అమ్ముడుకావటం మార్కెట్ లో హైప్ ని క్రియేట్ చేస్తుంది. డైరెక్ట్ తెలుగు వెర్షన్ కి కోలీవుడ్ లో ఇంత ఎక్కువ ధరకు పోవడం ఇదే తొలిసారి.



మరింత సమాచారం తెలుసుకోండి: