ఇండియన్ సినిమా ప్రేక్షకులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క చిత్రం బాహుబలి 2 ... ట్రైలర్ తోనే ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కి గురి చేసిన ఈ చిత్రం విడుదల కి సరిగ్గా నలభై రోజుల గ్యాప్ ఉంది. ట్రైలర్ ద్వారా వచ్చిన అంచనాలు ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్ క్యారీ చెయ్యాలి అని బాహుబలి బృందం పథకం రచిస్తోంది. ట్రైలర్ లాంచ్ త్వరవాత ఇప్పుడు ఆడియో వేడుక కి రంగం సిద్ధం చేస్తున్నారు.


ఈ నెల 26 న రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ చిత్రం ఆడియో అట్టహాసంగా జరగబోతోంది. బాహుబలి 2 ఫస్ట్ లుక్ లాంచ్ అయినప్పుడు దలేర్ మేహేంది వాయిస్ తో సాహోరే బాహుబలి అంటూ హమ్మింగ్ వినిపించింది. బాహుబలి 2 ఆడియో లో ఈ పాట మొదటిది. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా  రాసారు. మౌనిమ కూడా దలేర్ తో పాటు ఈ పాటకి వాయిస్ ఇచ్చారు.


చైతన్య ప్రసాద్ రాసిన హంస నావ అనే పాటని సోనీ - దీపు పాడారు. ఇది డ్యూయెట్ సాంగ్ .. కన్నా నిదురించరా అనే పాట ని శ్రీ సౌమ్య , నిధి లు పడగా. దండాలయ్యా.. ఒక ప్రాణం అనే పాటల్ని కాలభైరవ అనే గాయకుడు పాడారు. మరి ఈ పాటలెలా ఉంటాయో ఈ ఆదివారం తెలుసుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: