దర్శక దిగ్గజం రాజమౌళి పేరు ఇప్పుడు దేశం మొత్తం మారు మోగుతోంది. బాహుబలి 1 కి ముందర ఈగ డైరెక్టర్ గా అంటే హిందీ డబ్బింగ్ అయిన మక్కీ డైరెక్టర్ గా మాత్రమే కొంతమంది బాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితం అయిన మౌళి ఇప్పుడు వారంతా వికీపీడియా, గూగుల్ లో తన పేరు టైప్ చేసి తన గురించి తెలుసుకునేలా చేసారు రాజమౌళి. ఆయన సినిమాలకి ఉన్న స్టామినా కి ఇదొక ఉదాహరణ మాత్రమే. బాలీవుడ్ సినిమా పిచోళ్ళు అందరూ యూట్యూబ్ లో రాజమౌళి డైరెక్షన్ చేసిన డబ్బింగ్ సినిమాలు ప్రస్తుతం ఎగబడి చూస్తున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొదటి భాగం ముందర అనామకుడు అయిన మౌళి రెండో భాగం టైం కి పెద్ద ఫేమస్ అయిపోతాడు అని ఆయనకి ముందరే తెలుసు.


పైకి సైలెంట్ గా ఏమీ తెలియని అమాయకుడిలా ఉండే మౌళి అద్వితీయమైన విజన్ తో ముందుకు సాగుతున్నారా అనిపించక మానదు. మొదటి భాగానికి సంబంధించి కొన్ని సీన్ లు లీక్ అయిన నేపధ్యం లో రెండో భాగం విషయం లో మౌళీ ఎక్కడా తగ్గలేదు సినిమా షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచీ ఆఖరి రోజు వరకూ ఆయన తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. ఆయన అనుమతి లేకుండా సినిమాకి సంబంధించి ఒక్క లొకేషన్ స్టిల్ కూడా బయటకి రాలేదు. ఫూటేజీ ని కూడా అందరి లాగా ఎడిటింగ్ రూమ్ లో వదిలేయలేదు మౌళి.


ఇలా జరగకుండా అమెరికా నుంచి ఒక సూపర్ న్యూ డేటా స్టోరేజీ ని తెప్పించిన ఆయన ఫింగర్ ప్రింట్ స్కానర్ లో లాక్ చేసారు. మౌళి తప్ప ఎవ్వరూ అది ఓపెన్ చెయ్యడానికి ఛాన్స్ లేదు. లొకేషన్ లో సెల్ ఫోన్ ల అనుమతి నిరాకరణ, డిపార్ట్మెంట్ డిపార్ట్ మెంట్ వారికి ఐడీ కార్డులు ఇవ్వడం , రామోజీ లాంటి పెద్ద ప్లేస్ లో ఈ సినిమా షూట్ జరిగినా ఒక్కరు కూడా లోపలి రాకుండా టైట్ సెక్యూరిటీ పెట్టడం ఇలా ఒక్కటేమిటి చాలానే ముందు జాగ్రత్త చర్యలు అమలు చేశారు. ఇక స్క్రిప్ట్ విషయం లో కూడా ప్రభాస్, రానా, అనుష్క లకి తప్ప ఈ సినిమా లో నటించిన మిగితా వారికి కూడా అసలు కథ వివరంగా తెలీదు. కీరవాణి , తమన్నా , రమ్యకృష్ణ లాంటి వారు కూడా తెరమీద నే సినిమా కథ తెలుసుకోవాలి అంటే ఇక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న తమన్నా స్వయంగా ఈ విషయం వెల్లడించడం విశేషం. " నా సీన్ లు నాకు చెప్పారు తప్ప. కథ గురించి చెప్పలేదు " అంటూ షాక్ ఇచ్చింది ఆమె.


ఈ సినిమా విషయం లో ఆయన జాగ్రత్తలు చెప్పడానికి దీని ఆడియో ట్రాక్ లిస్టు ఒక ఉదాహరణ. ఐదు పాటలు ఉన్న ఈ ఆల్బం మొత్తం రాజమౌళి కుటుంబ సభ్యులు రాయడం విశేషం. కీరవాణి తన కలానికి పని చెప్పి నాలుగు పాటలు రాయగా, కీరవాణి తండ్రి శివదత్త మరో పాట రాశారు. కీరవాణి గేయ రచన గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆయన సంగీత దర్శకుడిగా మారినప్పటినుండి అడపాదడపా రాస్తూనే వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: